Telangana:ఇవాళ సాయంత్రం 6గంటలకు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ

Telangana: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని ప్రజాభవన్ వేదికగా ఇవాళ సాయంత్రం 6గంటలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశానికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

Update: 2024-07-06 00:25 GMT

Telangana:ఇవాళ సాయంత్రం 6గంటలకు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ

Telangana:రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని ప్రజాభవన్ వేదికగా ఇవాళ సాయంత్రం 6గంటలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశానికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఈ సందర్భంగా ప్రధానంగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్న సంస్థల విభజనపై చర్చించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. విద్యుత్తు సంస్థలకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చించే అవకాశం ఉంది. దాదాపు రూ. 24వేల కోట్లు ఏపీ ప్రభుత్వం తెలంగాణకు చెల్లించాలి. కానీ రూ. 7వేల కోట్లు తెలంగాణ తమకు చెల్లించాల్సి ఉందని ఆంధ్రప్రదేశ్ పట్టుబడుతోంది. కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత విభజనకు సంబంధించి పెండింగ్ లో ఉన్న అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు.

ఈమధ్యే మైనింగ్ కార్పొరేషన్ కు సంబంధించిన నిధుల పంపిణీకి పడిన చిక్కుముడి కూడా వీడిపోయింది. ఇప్పటి వరకు విభజన వివాదాలపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య 30 సమావేశాలకు పైగానే జరిగాయి. షెడ్యూలు 9లో ఉన్న మొత్తం 91 సంస్థలు ఆస్తులు, అప్పుల, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోంశాఖ షీలాబీడే కమిటీని వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించిన పంపిణీకి అభ్యంతరాలేమీ లేవు. మిగతా 23 సంస్థల పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం జరగలేదు. 10వ షెడ్యూలులో ఉన్న142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలు అలాగే ఉన్నాయి. 

Tags:    

Similar News