Chandrasekhar: మాజీమంత్రి చంద్రశేఖర్‌ ఇంట్లో తెలంగాణ ఉద్యమకారుల భేటీ

Chandrasekhar: హాజరుకానున్న మాజీ ఎమ్మెల్యే ఎం.శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌

Update: 2021-06-27 06:53 GMT

మాజీ మంత్రి చంద్రశేఖర్ (ఫైల్ ఫోటో)

Chandrasekhar: కాసేపట్లో మాజీమంత్రి చంద్రశేఖర్‌ ఇంట్లో తెలంగాణ ఉద్యమకారులు ఉమ్మడి సమావేశం కానున్నారు. ఈ భేటీకి మాజీ ఎమ్మెల్యే ఎం.శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, చెరుకు సుధాకర్‌, విమలక్క, రాములు నాయక్‌, రాణిరుద్రమ, రౌతు కనకయ్య, బెల్లయ్య నాయక్‌, గాదె ఇన్నయ్యతో పాటు.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా పనిచేసిన అన్ని పార్టీల ఉద్యమకారులు పాల్గొననున్నారు. సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. ఉద్యమకారులు ఏకం కావాలనే ఉద్దేశంతో ఈ సమావేశం జరగనుంది.

Tags:    

Similar News