నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీడీపీ పోటీ
* అభ్యర్ధిగా మువ్వ అరుణ్ కుమార్ పేరు ప్రకటన * 1994లో కాంగ్రెస్ నుండి జానారెడ్డి పోటీ * జానారెడ్డి మీద ఘన విజయం సాధించిన
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక బరిలో టీడీపీ ఉనికి కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికల బరిలో త్రిముఖ పోరే కాదు తమున్నమంటూ ముందుకు వెళ్తుంది. తమకు బలమైన క్యాడర్ ఉందని విజయావకాశాలు సమానంగా ఉన్నాయని టీడీపీ రాష్ట్ర నేతలు చెప్తున్నారు.
నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీడీపీ పోటీ చేస్తోంది. చాలా కాలంగా పార్టీ కోసం పని చేసిన న్యావాది మువ్వ అరుణ్ కుమార్ ను అభ్యర్ధిగా ప్రకటించింది. ఈ నియోజకవర్గంలో ఇప్పుడున్న పెద్ద పెద్ద లీడర్ లంతా ఒకప్పుడు టీడీపీ నుంచి వచ్చిన వారే. ఇక్కడ తెలుగు దేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉందని టీడీపీ రాష్ట్ర నేతలు చెప్తున్నారు. 1994లో జానారెడ్డి కాంగ్రెస్ నుండి పోటీ చేసినప్పుడు తెలుగుదేశం అభ్యర్థి గుండెబోయిన రామ్మూర్తి యాదవ్ భారీ విజయం సాధించారు. దీనికి కారణం అక్కడ తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉండడమే.
1999, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ కు టీడీపీ గట్టిపోటీని ఇచ్చింది. ప్రస్తుతం నాగార్జున సాగర్ లో నాయకులు పార్టీలు మారిన క్యాడర్ మాత్రం తమ వైపే ఉందని రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి మహాకూటమి తరపున పోటీ చేసినప్పుడు టీడీపీ జానారెడ్డికి మద్దతు ఇచ్చింది. నాగార్జునసాగర్ గ్రామాల్లో టీడీపీకి ఇప్పటికీ బలమైన క్యాడర్ ఉందని నాయకులు అంచనా.
నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలకు టీడీపీ 14 పోర్ట్ పోలియోలు కేటాయించిందని, నాగార్జున సాగర్ లో తాము చేసిన అభివృద్దే ఇంకా కొనసాగుతుందన్నారు టీడపీ పాలిట్ బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్ గౌడ్. నాగార్జున సాగర్ లో పక్కా రోడ్లు, ప్రతి గ్రామానికి కరెంట్ సరఫరా, పక్కా గృహాల నిర్మాణం టీడీపీ హయంలోనే జరిగిందని అరవింద్ కుమార్ అన్నారు.
ఇప్పటికే నాగార్జున సాగర్ ఉప ఎన్నిక మీద కన్ను వేసి అన్ని పార్టీలు నువ్వా నేనా అన్నట్టు బరిలోకి దిగుతున్నాయి. ఇలాంటి సమయంలో అసలే నాయకత్వ లోపంతో ఉన్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాగార్జున సాగర్ ఉప ఎన్నికల బరిలో నిలిచిన ఎంత వరకు ప్రయోజనం ఉంటుందో చూడాల్సిందే.