కోవిద్ నిబంధనలు ఉల్లంఘించిన పబ్ లపై టాస్క్ ఫోర్స్ దాడులు
హైదరాబాద్ లో పబ్ యాజమాన్యాలు నిబంధనలు ఉల్లఘించడంలో ఘనులు. ఇప్పుడు కోవిడ్ పరిస్థితుల్లోనూ విచ్చలవిడిగా తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు.
ప్రభుత్వం, అధికారులు కరోనా పట్ల ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నా కొంతమంది మాత్రం ఏమీపట్టనట్టు వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్‌లో కోవిడ్ నిబంధనలు బేఖాతరు చేస్తూ పబ్‌లు నిర్వహిస్తున్నారు.
మామూలుగానే హైదరాబాద్ లో పబ్ యాజమాన్యాలు నిబంధనలు ఉల్లఘించడంలో ఘనులు. ఇప్పుడు కోవిడ్ పరిస్థితుల్లోనూ విచ్చలవిడిగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తూ..యువత భవిష్యత్ గందరగోళం చేస్తున్నారు.
మాస్కులు, భౌతికదూరం లేకుండా పబ్‌లలో చిందులు తొక్కుతున్నారు. మాకేం కరోనా రాదన్నట్టు వ్యవహరిస్తున్నారు. విషయం తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. జూబ్లీహిల్స్‌లో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన నాలుగు పబ్బులపై దాడి చేసి.. కేసులు నమోదు చేశారు.
పబ్ ల నిర్వహణలో యాజమాన్యాలు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ దాడులు కొంతవరకూ పరిస్థితిని అదుపు చేసే అవకాశం ఉంది. పది మంది వచ్చి చేరే చోట కచ్చితంగా అన్నిరకాలుగాను జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అది సమాజానికి చెరుపు చేస్తుంది.