Cheating on the Name of CM PA: సీఎం పీఏ అంటూ మోసం.. కేటుగాడి అరెస్టు
Cheating on the Name of CM PA: సీఎం కేసీఆర్ పర్సనల్ సెక్రటరీనంటూ ప్రజలను మోసం చేస్తున్న ఓ యువకుడిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఇటీవలి కాలంలో నిందితుడు పలువురిని బెదిరించి భయభ్రాంతులకు గురిచేసినట్లు, నకిలీ నియామకపు ఉత్తర్వులు సృష్టించినట్టు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది.
Cheating on the Name of CM PA: సీఎం కేసీఆర్ పర్సనల్ సెక్రటరీనంటూ ప్రజలను మోసం చేస్తున్న ఓ యువకుడిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఇటీవలి కాలంలో నిందితుడు పలువురిని బెదిరించి భయభ్రాంతులకు గురిచేసినట్లు, నకిలీ నియామకపు ఉత్తర్వులు సృష్టించినట్టు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలో దిగిన పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.
వివరాల్లోకెళ్తే.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం, మొగిలిపాలెం గ్రామానికి చెందిన సాయి చందన్ కరీంనగర్‌లోని విద్యానగర్‌లో ఉంటున్నాడు. ముఖ్యమంత్రి అడిషినల్ సెక్రటరీగా, సీఎం ఫ్యామిలీ వ్యవహారాలు చూస్తుండటంతో పాటు ఏసీబీ కరీంనగర్ జిల్లా ఛైర్మన్‌గా కొనసాగుతున్నానని చెప్పుకుంటూ గత కొద్ది నెలలుగా ప్రజలను మభ్యపెడుతున్నాడు. ఆ ప్రాంత ప్రజలను ఓ రకంగా భయబ్రాంతులకు గురిచేశాడు. సీఎం ఆఫీసుకు చెందిన రాజశేఖర్ రెడ్డి పేరు మీద నకిలీ ఐడీ కార్డు సృష్టించుకుని,
ఉద్యోగాల పేరుతో అమాయకులను టార్గెట్ చేసాడు. వారి నుంచి భారీగా నగదు వాసులు చేసినట్టు తెలుస్తుంది. ఈ సమయంలో అందరకీ సీఎం కేసీఆర్, కేటీఆర్‌లతో దిగిన ఫోటోలను వాడుకుంటూ మోసం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ సమాచారం టాస్క్‌ఫోర్స్ చెవిన పడింది. అతడు మరీ ఓవరాక్షన్ చేస్తుండటంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా సీఎం నకిలీ పీఏ బాగోతం వెలుగులోకి వచ్చింది.