TS News: ప్రజా బాట పట్టనున్న తెలంగాణ గవర్నర్...
TS News: రాజ్‌భవన్‌కు దూరంగా ఉంటున్న తెలంగాణ ప్రభుత్వం...
TS News: తెలంగాణ గవర్నర్ తమిళిసై ఇక మీదట ప్రజా బాట పట్టనున్నారు. గవర్నర్ అంటే కేవలం రాజ్ భవన్ కే పరిమితం అన్న చరిత్రను చెరిపేస్తున్నారు. ప్రజా సమస్యలపై స్పందిస్తూ తన మార్క్‌ను చూపిస్తున్నారు. గవర్నర్ కు ఉన్న విచక్షణ అధికారాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై నిర్ణయాల్లో వేగం పెంచారు. ప్రభుత్వ పాలసీలు, నిర్ణయాలను నేరుగా ప్రశ్నించకపోయిన ప్రజల సమస్యలపై స్పందిస్తున్నారు.
గతంలో ఆమె నాగర్ కర్నూల్ జిల్లా నల్లమలలో ఉన్న చెంచుల వద్దకు వెళ్లి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ శాఖల సమన్వయంతో చెంచులకు సాయం అందించేందుకు తమిళిసై కృషి చేస్తున్నారు. పోషకాహారం లోపంతో బాధపడుతున్న నల్లమల చెంచులని కాపాడేందుకు కొన్ని గ్రామాలను గవర్నర్ దత్తత తీసుకున్నారు. పోషకాహార లోపం, అనారోగ్య సమస్యలు , ప్రసవాలు , మాతా శిశు మరణాల పై ఆమె సీరియస్ గా స్పందించారు.
గవర్నర్ కోటలో కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ గా రాష్ట్ర సర్కారు ప్రపోజల్ ను ఆమె తిరస్కరించారు. దీంతో అప్పటి నుంచి సర్కార్ కు రాజ్ భవన్ కి మధ్య గ్యాప్ మొదలైంది. ఆ తర్వాత రాజ్ భవన్ లో గ్రీవెన్ సెల్ ఏర్పాటు చేయడం వివాదం మరింత ముదిరింది. ఉగాది వేళ ప్రభుత్వానికి గవర్నర్ కి మధ్య ఉన్న గ్యాప్ మరోసారి బయటపడింది. దీంతో గవర్నర్ తమిళిసై తెలంగాణ ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ప్లాన్‌లు చేస్తున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా గవర్నర్ తమిళిసై ఇవాళ రాత్రి భద్రాద్రి వెళ్లనున్నారు.
రెండు రోజుల పాటు భద్రాద్రిలోనే ఉండి మూడు గ్రామాలను సందర్శించనున్నారు. అనంతరం రామప్ప టెంపుల్ ను కూడా విసిట్ చేయనున్నారు. ఇక భద్రాద్రి పర్యటన తరువాత యూనివర్సిటీలు, ప్రభుత్వ ఆసుపత్రులు , గ్రామాల్లో ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలను సందర్శించనున్నారు. మొత్తానికి ఢిల్లీ నుంచి వచ్చిన అభయంతో గవర్నర్ తన పరిధిలోనే ఉన్నట్లుగా ఉంటూ రాష్ట్ర సర్కారు వైఫల్యాలను పరోక్షంగా తెలిపేలా టూర్లు ప్లాన్ చేస్తున్నారు.