Talasani: మళ్లీ తామే అధికారంలోకి వస్తామన్న తలసాని
Talasani: సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తామన్న తలసాని
Talasani: మళ్లీ తామే అధికారంలోకి వస్తామని, అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు యధావిధిగా కొనసాగిస్తామని సనత్ నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. సనగత్‌నగర్ నియోజకవర్గంలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అడుగడుగునా మంత్రికి బ్రహ్మరథం పట్టారు. మహిళలు మంగళహారతులిచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలనే లక్ష్యంతోనే దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.