swiggy delivery boys protests : టేస్టీ టేస్టీ ఫుడ్ తినాలనుకునే వారికి ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది స్విగ్గీ. స్విగ్గీలొ ఆర్డర్ పెట్టగానే కస్టమర్స్ సాటిస్ ఫై అయ్యే విధంగా డెలివరీ బాయ్స్ తమకు కావలసిన ఆహారాన్ని తెచ్చేస్తారు. అయితే ఇప్పుడు ఆ డెలివరీ బాయ్స్ కి ఏం కష్టం వొచ్చిందో పాపం తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ తమను మోసం చేస్తోందంటూ నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం మాదాపూర్ పోలీసు స్టేషన్ ఎదురుగా డెలివరీ బాయ్స్ అంతా ఆందోళన చేపట్టారు. స్విగ్గి కంపెనీ యాజమాన్యం తమకు కమిషన్ తక్కువగా ఇస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో 2 కిలో మీటర్ల పరిధిలోపు ఫుడ్ డెలివరీ చేస్తే ఒక్కో బాయ్‌కు రూ.35 కమీషన్ ఇచ్చిన స్విగ్గీ ప్రస్తుతం భారీగా కోత విధించిందని వెల్లడించారు. ఒక కిలోమీటర్ పరిధిలోపు డెలివరీ చేస్తే కేవలం 6 రూపాయలు మాత్రమే ఇస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థ విధించిన కోతలతో తాము రోజుకు కనీసం రూ.200 కూడా సంపాదించలేని పరిస్థితి ఎదురైందని ఉద్యోగులు వాపోయారు. స్విగ్గీ మోసం చేస్తోందంటూ మాదాపూర్ పోలీసు స్టేషన్‌లో పిర్యాదు చేశారు. స్విగ్గీ యాజమాన్యం థర్డ్ పార్టీని పెట్టి తమ పొట్ట కొడుతోందని స్విగ్గి డెలివరీ బాయ్స్ ఆరోపించారు. థర్టీ పార్టీకి ఎక్కువ కమీషన్ ఇస్తున్న స్విగ్గీ కంపెనీ తమకు మాత్రం తక్కువ కమిషన్లను చెల్లిస్తోందని వాపోయారు. ఇక ఈ వ్యవహారంపై స్విగ్గీ ప్రతినిధులు స్పందించారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామినిచ్చారు. ఆ మాటలు విన్న డెలివరీ బాయ్స్ రెండు రోజుల్లో సమస్యలు పరిష్కారం కాకుంటే హైదరాబాద్ మొత్తం ఆందోళనలు చేస్తామని తేల్చి చెప్పారు.