తెలంగాణ గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు కుదరదు: సుప్రీంకోర్టు సంచల తీర్పు
Supreme Court: తెలంగాణ గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు, మెయిన్స్ వాయిదా వేయాలని దాఖలై పిటిషన్ ను ఉన్నత న్యాయస్థానం శుక్రవారం కొట్టివేసింది.
Supreme Court: తెలంగాణ గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు, మెయిన్స్ వాయిదా వేయాలని దాఖలై పిటిషన్ ను ఉన్నత న్యాయస్థానం శుక్రవారం కొట్టివేసింది. ఈ నోటిఫికేషన్ రద్దు కుదరని ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.2022 గ్రూప్ -1 నోటిఫికేషన్ ను పక్కన పెట్టి 2024లో కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం చట్ట విరుద్దమని తెలంగాణ హైకోర్టులోపిటిషన్ దాఖలు చేశారు.
2024 గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షల్లో కూడా 14 తప్పులున్నాయని మెయిన్స్ ను వాయిదా వేయాలని అభ్యర్ధులు కోరారు.అయితే ఈ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేశారు.జస్టిస్ పి.ఎల్. నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. కోర్టును ఆశ్రయించిన అభ్యర్ధులు ఎవరూ ప్రిలిమ్స్ పరీక్షలు పాస్ కానందున మెయిన్స్ వాయిదా వేయాల్సిన అవసరం లేదని ధర్మాసనం తెలిపింది.
పరీక్షల నిర్వహణలో కోర్టుల జోక్యం అనవసరమని కోర్టు అభిప్రాయపడింది. దీని వల్ల నియామక ప్రక్రియలో ఆలస్యం అవుతుందని ఉన్నత న్యాయస్థానం తెలిపింది.అభ్యర్థుల అభ్యంతరాలను పక్కన పెట్టి మెయిన్స్ పరీక్షల నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ఈ ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరిగాయి. 563 పోస్టుల భర్తీ కోసం ఈ పరీక్షలు నిర్వహించారు. ప్రిలిమ్స్ రాసిన 31,383 మంది మెయిన్స్ కు అర్హత సాధించారు. ఇదే షెడ్యూల్ ప్రకారంగా పరీక్షలు జరిగాయి. పరీక్షల ప్రారంభానికి నిమిషాల ముందు ఈ పరీక్షల్లో తాము జోక్యం చేసుకోబోమని అప్పట్లో సుప్రీంకోర్టు తెలిపింది. అదే పిటిషన్ పై విచారణను ఇవాళ చేసింది. ఈ నోటిఫికేషన్ రద్దు చేయడం కుదరదని స్పష్టం చేసింది.