Supreme Court: కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

Update: 2024-08-12 07:42 GMT

Supreme Court: కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ నెల 20న విచారణ చేపడతామని తెలిపింది. వాదనల తర్వాతే నిర్ణయం తీసుకుంటామని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టును కవిత ఆశ్రయించారు. మద్యం పాలసీ కేసులో కవిత సాక్ష్యాలను ధ్వంసం చేయడంతోపాటు సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారన్న దర్యాప్తు సంస్థల వాదనలతో ఢిల్లీ హైకోర్టు ఏకీభవించింది.

ఈడీ, సీబీఐ కేసుల్లో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఈ నెల 8న కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్‌ చేసింది. నాటి నుంచి ఆమె తిహాడ్‌ జైలులోనే ఉన్నారు. కవిత తిహాడ్‌ జైలులో ఉండగానే ఏప్రిల్‌ 15న సీబీఐ అరెస్టు చేసినట్టు ప్రకటించింది.

Full View


Tags:    

Similar News