Mano Vignana Yatra 2022: 9వ రోజు ఖమ్మం జిల్లాకు చేరుకున్న మనోవిజ్ఞాన యాత్ర
Mano Vignana Yatra 2022: యువతకు విజ్జానాన్ని, స్ఫూర్తిని అందిస్తూ సాగుతున్న మనోవిజ్ఞాన యాత్ర 9వ రోజు ఖమ్మం జిల్లాకు చేరుకుంది.
Mano Vignana Yatra 2022: యువతకు విజ్జానాన్ని, స్ఫూర్తిని అందిస్తూ సాగుతున్న మనోవిజ్ఞాన యాత్ర 9వ రోజు ఖమ్మం జిల్లాకు చేరుకుంది. భక్త రామదాసు కళాక్షేత్రం, SR అండ్ BGNR కాలేజీ, కిట్స్ కళాశాల, ప్రభుత్వ పాఠశాల్లోని విద్యార్థులకు మనోవిజ్ఞాన యాత్రలో భాగంగా పలు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఒత్తిడిని ఏ విధంగా అధిగమించాలి..విద్యార్థులపై సోషల్ మీడియా ప్రభావం, యువతకు ఉపాధి కల్పించే టెక్నికల్ స్కిల్స్ పలు అంశాలపై అవగాహన కల్పిచారు. తెలంగాణ ప్రభుత్వంతో పాటుగా సూపర్ ఫౌండేషన్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ, hmtv ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి యువత నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది.
జీవితంలో ఎదురయ్యే మానసిక అనారోగ్యం, ఒత్తిడి, ఆర్థిక, సాంకేతిక సమస్యలను అధిగమించి ప్రతి ఒక్కరూ వారి రంగాల్లో ఉన్నత శిఖరాలను అంధిరోహించడమే లక్ష్యంగా ప్రారంభమైంది మిషన్ మనో విజ్ఞాన యాత్ర. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 30 జిల్లాల్లో 30 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. ప్రముఖ సైకాలజిస్ట్ సుధీర్ సండ్ర, ఎడిట్ పాయింట్ అధినేత రమేశ్ ఇప్పలపల్లి, ప్రముఖ డిజిటల్ మార్కెటింగ్ నిపుణులు నిఖిల్ గుండ వారి రంగాలకు సంబంధించిన విలువైన సూచనలు, సలహాలు ఇస్తారు.
ఎలాంటి ప్రవేశ రుసుం లేని ఈ ఉచిత సెషన్లలో పాల్గొనడానికి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి.
రిజిస్ట్రేషన్ లింక్: www.manovignanayatra.com