Telangana: సొంత గ్రామాలకు పయనమైన విద్యార్థులు

Telangana: విద్యార్థులు సొంత గ్రామాలకు బయల్దేరడంతో అటు ఎంజీబీఎస్‌, ఇటు జేబీఎస్‌ కిటకిటలాడుతున్నాయి.

Update: 2021-03-26 06:49 GMT

తెలంగాణ:(ఫైల్ ఇమేజ్)

Telangana: తెలంగాణలో కరోనా వైరస్‌ జడలు విప్పుతోంది. పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో ముందు జాగ్రత్తగా రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు బంద్ ప్రకటించింది. దీంతో విద్యార్థులు సొంత గ్రామాలకు బయల్దేరడంతో అటు ఎంజీబీఎస్‌, ఇటు జేబీఎస్‌ కిటకిటలాడుతున్నాయి. అయితే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినప్పటికీ.. కొన్ని ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. చెప్పాలంటే.. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే రోజుకు వందల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దీంతో హైదరాబాద్‌లో ఉండటానికి భయపడుతున్న ప్రజలు సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ అధికారులు కొవిడ్‌ నిబంధనలు అమలు చేస్తున్నారు. మాస్కులు ధరించినవారినే బస్‌ ఎక్కించుకుని వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ప్రభుత్వం విద్యాసంస్థలను మూసివేయడంతో విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఏ ఏడాది నష్టపోయామంటున్న స్టూడెంట్స్‌.. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు రాసేవాళ్లమని చెబుతున్నారు. క్లాస్‌లు సరిగ్గా జరగకపోవడంతో భవిష్యత్తులో తాము నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు ఆరోగ్యం కూడా ముఖ్యమే గనుక ఇంటికి వెళ్లాల్సి వస్తుందంటున్నారు.

మరోవైపు విద్యాసంస్థలకు బంద్‌ ప్రకటించిన నేపథ్యంలో సొంత గ్రామాలకు వెళ్లే స్టూడెంట్స్‌ను దృష్టిలో పెట్టుకుని అదనపు బస్సులను ఏర్పాటు చేశామంటున్నారు ఆర్టీసీ అధికారులు. దూర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బంది పడకుండా గ్రామాలకు సిటీ బస్సులను నడుపుతున్నట్లు చెబుతున్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ బస్సులో ప్రయాణికులను తరలిస్తున్నట్లు తెలియజేశారు. మొత్తానికి రాష్ట్రంలో పాజిటివ్‌ కేసులు పరేషాన్‌ చేస్తున్నాయి. దీంతో ప్రజలు భయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. మహమ్మారి వెంటాడుతుండటంతో విద్యార్థులు భయపడుతున్నారు.

Tags:    

Similar News