Sridhar Babu: కాంగ్రెస్‌ని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు
Sridhar Babu: అధికారంలోకి వచ్చిన వెంటనే బెల్ట్ షాప్‌ల విషయంలో.. మహిళలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటాం
Sridhar Babu: పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం ముత్తారం మండలంలోని పలు గ్రామాల్లో శ్రీధర్ బాబు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని, రెండు సార్లు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నియోజకవర్గా్న్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశానని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఎక్సయిజ్ పాలసీని పునఃపరిశీలించి బెల్ట్ షాప్‌ల విషయంలో మహిళల అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ప్రజలు అభివృద్ధి దిశగా పయనించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.