కాసుల కోళ్లు..!

Update: 2020-10-08 11:24 GMT

కరోనా ఎంట్రీతో అన్ని రంగాలు కుదేలయ్యాయి. కానీ మన బాడీలో ఇమ్యూనిటీని పెంచే మాంసాహారం వ్యాపారం మాత్రం జబర్దస్త్ గా నడుస్తుంది. ఈ క్రమంలో మామూలు ఫారం కోళ్ల కన్నా కడక్ నాథ్ కోడి మాంసం మంచి రోగ నిరోధక శక్తిని కలిగుందని చెపుతున్నారు. ఇంకేం దాంతో ఈ నల్లకోళ్ల మాంసానికి బాగా డిమాండ్ పెరిగింది.

కడక్ నాథ్ కోడి మాంసానికి ఇమ్యూనిటీ పవర్ బాగా ఉందని తెలిసి ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో వీటి పెంపకాలు పెరిగాయి. ఇక్కడ ఇది ఓ ప్రత్యేక కుటీర పరిశ్రమలా మారింది. మధ్యప్రదేశ్ స్వస్థలమైన ఈ నల్లకోడి మాంసం ఎన్నో పోషక విలువలతో పాటు ఔషధ గుణాలు కలిగుండడంతో అటు మాంసా ప్రియులతో పాటు ఇటు హెల్త్ కేర్ తీసుకునేవారిని సైతం బాగా ఆకర్షిస్తోంది.

నల్లకోడి మాంసంలో జీరో శాతం ఫాట్ ఉండడంతో బీపీ, షుగర్, కరోనా ఉన్నవారు కూడా ఆహారంగా తీసుకుంటున్నారు. నల్లకోడి అన్నందుకు దీని మాంసంతో పాటు ఎముకలు కూడా నల్లగే ఉంటుంది. మొదటి నుంచి డిమాండ్ ఉన్న కడక్ నాథ్ కోడి మాంసం కరోనా ప్రభావంతో మరింత గిరాకీ పెరిగింది. దీని ధర కేజీ ఆరు వందల నుంచి 700 వందల వరకు పలుకుతుంది. ఒకప్పుడు గ్రామాల్లో చిన్న, సన్నకారు రైతులు, భూమిలేని వ్యవసాయ కూలీలు నాటుకోళ్ల పెంపకాన్ని ఒక వ్యాపరంగా చేపట్టేవారు. అయితే ప్రస్తుతం కరోనా నేపథ్యంలో నాటుకోడి మాంసానికి డిమాండ్ బాగా పెరగడంతో పెరటి కోళ్ల పెంపకం సైతం నేడు ప్రత్యేక కుటీర పరిశ్రమలా మారింది.

Full View


Tags:    

Similar News