Corona Fear in Hyderabad: ఏమో... ఇంకెన్ని దారుణాలు వినాలో!!. ఇంకెన్ని దుర్మార్గాలను చూడాలో!!. కరోనా కరళా నృత్యానికి ఇంకెంత మంది బలవ్వాలో!! ఒకటి కాదు రెండు కాదు... దేశాలకు దేశాలే ఈ మహమ్మారి బారిన పడి గజగజ వణుకుతున్నాయ్. ఎవరికి ఎవరిని కాకుండా చేస్తూ ఎవరిని ఎవరితో కలవనీయకుండా చేస్తోంది. కల్లోలానికి గురి చేస్తున్న కరోనా వికృత రూపాన్ని ఇంకెన్ని కోణాల్లో చూడాల్సి వస్తుందోనని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఎక్కడి వాళ్లక్కడే గప్‌చుప్ అన్నట్టు మారిపోతున్నారు. బంధువులను, అతిథులను గౌరవించే సంప్రదాయాన్ని, రా.... రమ్మని ఆహ్వానించే సంస్కృతినీ కానీయ్యకుండా చేస్తోంది. సాదరంగా పిలవడం పక్కన పెడితే... బాబోయ్ ఎవరూ మా ఇంటికి రావద్దూ అంటూ బోర్డులు పెట్టేస్తున్నారు. చూడండి... ఈ పాడు కరోనా ఎంత దారుణమైన రోజులను దాపురింపచేసింది. హైదరాబాద్‌లో ఇప్పుడిలాంటి పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
బంధువులని రావాలని ఎవరికి అనిపించదు చెప్పండి.. ప్రతీ ఒక్కరూ ఆత్మీయులు ఇంటికి రావాలనే అనుకుంటారు. వాళ్లింటికి వెళ్లాలనే అనుకుంటారు. మహానగరానికి వచ్చినా సాదరంగా ఆహ్వనించడం మన సాంప్రదాయం. వచ్చిన వాళ్లకు అనుకున్న మర్యాదలు చేయడం మన సంస్కృతి. కానీ ఇదంతా గతం. ఇప్పుడంతా సీన్ రివర్స్ అయింది. ఈ కరోనా ఏదైతే ఉందో మన సంప్రదాయాలను, మన సంస్కృతిని పూర్తిగా చిన్నాభిన్నం చేసింది. బంధువంటే భయపడే పరిస్థితికి తీసుకొచ్చింది. మా ఇంటికి రండి అనే సంప్రదాయం నుంచి మా ఇంటికి రాకండి అని చెప్పే పరిస్థితికి తీసుకొచ్చింది. దీనిపై హెచ్‌ఎంటీవీ ఒక గ్రౌండ్ రిపోర్ట్ చేసింది.
-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..