తెలంగాణ అంతటా విస్తరించిన నైరుతి రుతుపవనాలు

Telangana Wheather Report: *రెండు రోజులుగా పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు

Update: 2022-06-16 01:32 GMT

తెలంగాణ అంతటా విస్తరించిన నైరుతి రుతుపవనాలు 

Telangana Wheather Report: ఎండలు ఉక్కపోతతో ఇక్కట్లు పడుతున్న తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ శుభవార్త అందించింది. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు తెలిపింది. గత మూడు రోజుల క్రితం మహబూబ్‌నగర్‌ జిల్లా వరకు విస్తరించిన నైరుతి రుతుపవనాలు బుధవారం రాష్ట్రమంతా విస్తరించాయి. ప్రస్తుతం రుతుపవనాలు ఎఫెక్టు ఎలా ఉండబోతుంది. ఎక్కడెక్కడ వానాలు కురుస్తాయి.

నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించాయి. బుధవారం రోజు నైరుతి రుతుపవనాలు మరఠ్వాడా , తెలంగాణాలోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు, కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు, వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు జూన్ 15 న ప్రవేశించాయి. రుతుపవనాల ఉత్తర పరిమితి ఇప్పుడు డయ్యూ, నందుర్బార్, జల్గానో, పర్భాని, మెదక్, రెంటచింతల, మచిలీపట్నంల గుండా వెళుతుంది. మంగళవారం దక్షిణ ఉత్తరప్రదేశ్ నుండి దక్షిణ చత్తీస్ గఢ్ వరకు ఉన్న ఉత్తర- దక్షిణ ద్రోణి బుధవారం దక్షిణ బీహార్ నుండి తూర్పు మధ్య ప్రదేశ్ మీదుగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరం వరకు సగటు సముద్ర మట్టం నుండి 0 పాయింట్ 9 కిలో మీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతుందంటున్నారు వాతావరణ అధికారులు.

దీని ప్రబావంతో రాగల రెండు మూడు రోజులలో విదర్భ, తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్‌లోని మరికొన్ని భాగాలు, పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతం, ఒడిశాలోని కొన్ని ప్రాంతాలు, గంగా పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, మొత్తం ఉపహిమాలయన్ పశ్చిమ బెంగాల్, బీహార్లోని మరికొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ప్రస్తుతం క్రింది స్థాయి గాలులు ముఖ్యంగా పశ్చిమ దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయి. రాగల రెండు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, గంటకు 30నుండి 40 కిలో మీటర్ల గాలి వేగంతో కూడిన వర్షాలు కొన్ని జిల్లాలలో కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News