Singareni Strike: సింగరేణిలో మోగిన సమ్మె సైరన్‌

Singareni Strike:డిసెంబర్‌ 9 నుంచి నిరవధిక సమ్మె

Update: 2021-11-26 02:44 GMT

సింగరేణి కార్మికుల సమ్మె నోటీసులు (ఫైల్ ఇమేజ్)

Singareni Strike: సింగరేణిలో సమ్మె సైరన్‌ మోగింది. బొగ్గు గనుల్లోని బ్లాకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ టీబీజీకేఎస్‌ నోటీసు ఇచ్చింది. డిసెంబర్‌ 9వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తామని ప్రకటించింది. కేంద్రం దిగొచ్చే వరకు పోరాటం చేస్తామని సింగరేణి కార్మికులు స్పష్టం చేశారు. కల్యాణ్‌ ఖని బ్లాక్‌-6, కోయగూడెం బ్లాక్‌-3, సత్తుపల్లి బ్లాక్‌-6, శ్రావణపల్లి బ్లాకులను సింగరేణకి ఇవ్వాలని డిమాండ్‌ చేయనున్నారు.

కోల్‌ ఇండియాలోని 89 బ్లాకులతోపాటు సింగరేణిలోని నాలుగు బ్లాకుల ప్రైవేటీకరణపై కార్మిక సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. కాగా ప్రైవేటీకరణతో కార్మికులకు రావాల్సిన వారసత్వ ఉద్యోగాల్లో కోత, లాభాల్లో వాటాలు కూడా కనుమరుగవుతాయని యూనియన్‌ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు పేర్లు ఉన్న సింగరేణి కార్మికుల డిపెండెంట్స్‌కు బేషరతుగా ఉద్యోగాలు కల్పించాలంటున్నారు.

Full View


Tags:    

Similar News