పట్టు చీరకు వెండి కొంగు : నేతన్నల అద్భుత ఆవిష్కరణ

సిరిసిల్ల నేతన్నలు తమ అద్బుతమైన ప్రతిభతో ఎన్నో అద్బుతాను సృష్టిస్తున్నారు.

Update: 2020-05-31 05:48 GMT

సిరిసిల్ల నేతన్నలు తమ అద్బుతమైన ప్రతిభతో ఎన్నో అద్బుతాను సృష్టిస్తున్నారు.వారు దుస్తులపై వేసే ప్రతి డిజైన్ ఎంతో మంది మనసున్ను ఆకట్టుకునేలా చేస్తుంది. అంతే కాదు అగ్గిపెట్టెలో ఇమిడే చీరలు నేసి సిరిసిల్లకు అంతర్జాతీయ ఖ్యాతి దక్కించారు. నేత చీరలపై తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి ముఖ చిత్రాలను వేసి అభిమానాన్ని చాటుకున్నారు. ఇలాంటి ఎన్నో అద్భుతాలను సృష్టించిన నేతన్నలు మరో చారిత్రక అద్భుతాన్ని సృష్టించారు. వెండి కొంగుతో పట్టు చీరను నేసి అందరినీ అబ్బుర పరుస్తున్నారు. నేత కార్మికుడు నల్ల విజయ్‌ నేసిన వెండి కొంగు చీరను తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ఈ చీరను ఆవిష్కరించనున్నారు.

సిరిసిల్ల చేనేత ఖ్యాతిని పెంచిన నేతకార్మికుడు దివంగత నల్ల పరంధాములు బాటలోనే అతని తనయుడు విజయ్‌ నడుస్తున్నా డు. పరంధాములు అగ్గిపెట్టెలో ఇమి డే చీరను 1987లో తయారుచేసి గిన్నిస్‌బుక్‌లో చోటు సంపాదించారు. అదే బాటలో అతని కొడుకు విజయ్‌ కూడా పయనిస్తూ అగ్గిపెట్టెలో ఇమిడే చీర, శాలువాలను తయారు చేసారు. అంతే కాదు దబ్బనంలో దూరే చీర, 220 రంగుల్లో చీరలను నేసారు. దీంతో అతని పేరు 2018, 2019లో తెలంగాణ బుక్‌ ఆఫ్‌ రికార్డు, తెలుగు బుక్‌ రికార్డుల్లో రెండుసార్లు పేరు నమోదైంది. అంతే కాక కుట్టు లేకుండా లాల్చీపైజామా, జాతీయ జెండా, మూడు కొంగులతో చీరను నేసి ఆకట్టుకున్నాడు. తెలంగాణ సీఎం కేసీఆర్ మీదుగా చేనేత కళారత్న అవార్డును స్వీకరించాడు.

ఇప్పుడు ఇదే తరహాలో మరో అద్భుతాన్ని సృష్టించేందుకు శ్రీకారం చుట్టాడు. కంచిలో తయారుచేసే వెండి కొంగు చీరను రెండు రోజులపాటు శ్రమించి, మాన్యువల్‌ జకార్డ్‌ యంత్రంతో మరమగ్గంపై తయారుచేశాడు. 5.4 మీటర్ల పొడవు ఉండే చీరలో 90 సెంటీమీటర్ల బ్లౌజ్‌, 70 సెంటీమీటర్లు కొంగు ఉంటుంది. అయితే ఈ కొంగును తయారీని హైలెట్ చేయడానికి రూ.25 వేల వరకు వెచ్చించి 170 గ్రాముల వెండిని వినియోగించాడు.

Tags:    

Similar News