Telangana: ప్రచార ఖర్చుల కోసం.. మంత్రి కేటీఆర్‌కు రూ.లక్ష చెక్ అందజేసిన శ్రీకాంత్ తల్లి శంకరమ్మ
Telangana: బీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచార ఖర్చుల కోసం తనవంతు సాయం చేసిన శంకరమ్మ
Telangana: బీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచార ఖర్చుల కోసం తనవంతుగా తెలంగాణ అమరవీరుడు శ్రీకాంత్ ఆచారి తల్లి శంకరమ్మ.. లక్ష రూపాలయ చెక్‌ను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అందించారు. మంత్రి జగదీష్‌రెడ్డితో కలిసి హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ను ఆమె కలిశారు. అనంతరం.. లక్ష రూపాయల చెక్‌ను కేటీఆర్‌కు శంకరమ్మ అందజేశారు.
తెలంగాణ కోసం త్యాగం చేసిన అమరవీరుల ఆశయాల సాధన కోసం మరోసారి బీఆర్‌ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉందని.. ఈ సందర్భంగా కేటీఆర్‌కు శంకరమ్మ తెలిపారు. తిరిగి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. శంకరమ్మను మరింత గౌరవప్రదమైన స్థానంలో నిలిపే బాధ్యత తాను స్వయంగా తీసుకుంటానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.