Road Accident: మెదక్ జిల్లా శివంపేట మండలం ఉసిరికపల్లి వద్ద కల్వర్టు వద్ద కారు అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న కాలువలో పడింది. రోడ్డుపై ఉన్న గుంతలో కారు పడి అదుపుతప్పి చెట్టును ఢీకొంటూ పక్కనే ఉన్న కాలువలో బోల్తా పడింది.ఈ ప్రమాదంలో కారులోని ఏడుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ తీవ్రగాయాలతో బయటపడ్డారు. మృతులను రత్నాపూర్, తాళ్లపల్లి,పాముతండావాసులుగా గుర్తించారు. ఉసిరికపల్లి నుంచి వెల్దుర్తి వరకు రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి.