తెలంగాణలో ఒమిక్రాన్ టెన్షన్.. ఇప్పటివరకు 7 ఒమిక్రాన్ కేసులు నమోదు

*నిన్న ఒక్కరోజే రిస్క్ దేశాల నుంచి వచ్చిన 120 మంది *రిస్క్ దేశాల నుంచి వచ్చిన ఒకరికి ఒమిక్రాన్ పాజిటివ్

Update: 2021-12-17 03:45 GMT

తెలంగాణలో ఒమిక్రాన్ టెన్షన్

Omicron in Telangana: ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రపంచాన్ని వేగంగా చుట్టేస్తోంది. మన దేశంలోకి ఎంట్రీ ఆలస్యంగా వచ్చినా లేటేస్ట్‌గా కేసులు విజృంభిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో రెండు ఒమిక్రాన్ వేరియంట్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 7 ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. మెహిదీపట్నంలోని టోలిచౌకి ప్రాంతాన్ని మరోసారి కంటోన్మెంట్ జోన్‌గా ప్రకటించారు జీహెచ్ఎంసీ అధికారులు. నిన్న ఒక్కరోజే రిస్క్ దేశాల నుంచి వచ్చిన 120 మంది ప్రయాణికులు వచ్చారు. వీరిలో రిస్క్ దేశాల నుంచి వచ్చిన ఒకరికి, నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన ముగ్గురికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. అటు పారామౌంట్ కాలనీలో బాధితుల కాంటాక్ట్స్‌పై ట్రేసింగ్ కొనసాగుతోంది.

Tags:    

Similar News