Peddapalli: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో సెల్ఫ్ లాక్డౌన్
Peddapalli: లాక్డౌన్ పాటించాలని తీర్మానించిన వ్యాపార వర్గాలు * ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకే షాపులు
Peddapalli: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని వ్యాపార సంస్థలు సెల్ఫ్ లాక్‌డౌన్‌కు పూనుకున్నాయి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే షాప్‌లను తెరిచి ఉంచాలని తీర్మానం చేసుకున్నాయి. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యాపారులు వెల్లడించారు. వినియోగదారులు సహకరించి, ఈ సమయంలోనే వస్తువులు, సరుకులను కొనుగోలు చేయాలని కోరారు.