Secunderabad: డెక్కన్ మాల్ కూల్చివేతలో తప్పిన పెను ప్రమాదం..!
Hyderabad: సికింద్రాబాద్ డెక్కన్ మాల్ కూల్చివేతలో పెను ప్రమాదం తప్పింది.
Hyderabad: సికింద్రాబాద్ డెక్కన్ మాల్ కూల్చివేతలో పెను ప్రమాదం తప్పింది. కూల్చివేత సమయంలో ఒక్కసారిగా ఆరు ఫ్లోర్లు కుప్పకూలాయి. ముందు జాగ్రత్తగా చుట్టుప్రక్కల ఇళ్లను అధికారులు ఖాళీ చేయించడంతో ప్రమాదం తప్పింది. కాగా అగ్ని ప్రమాదం జరిగిన డెక్కన్ మాల్ బిల్డింగ్ కూల్చివేత పనులు గత ఆరు రోజులుగా కొనసాగుతున్నాయి. గురువారం రాత్రి 11 గంటల నుంచి భారీ యంత్రాల సాయంతో కూల్చివేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈనెల 19న డెక్కన్ నైట్ వేర్ స్పోర్ట్స్ దుకాణంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే.