మునుగోడులో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి అని వికాస్ రాజ్ తెలిపారు

* యంత్రాంగం బాగా పనిచేసింది.. చెదురు మదురు ఘటనలు మినహా... పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది

Update: 2022-11-04 02:15 GMT

మునుగోడులో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి అని వికాస్ రాజ్ తెలిపారు

Vikas Raj: మునుగోడులో ఓటర్లు స్వేచ్ఛగా వచ్చి ఓటుహక్కు వినియోగించుకున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించిన రాజకీయ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. మాక్ పోలింగ్ సందర్భంగా ఇబ్బందులు తెలుసుకుని కొత్త ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లనను ఏర్పాటు చేశామని, అక్కడక్కడా చెదురు మదురు ఘటనలు మినహా ఎక్కడా ఇబ్బందులు తలెత్తలేదన్నారు. ఆరో తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టిన ఫలితాలను వెల్లడిస్తామన్నారు.

మునుగోడు ఉపఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. రాత్రి 10.30 గంటల వరకు 92 శాతం పోలింగ్‌ నమోదైంది. వివిధ రాజకీయ పార్టీల నుంచి మొత్తం 98 ఫిర్యాదులు వచ్చాయి. వాటిపై క్షేత్రస్థాయిలోని అధికారులు తక్షణం స్పందించారు. కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఆ ఫిర్యాదులను పంపాం. నియోజకవర్గానికి సంబంధం లేని 70 మందిని బయటకు పంపాం. 3.29 కిలోల బంగారు ఆభరణాలను ...నగదు, ఇతర వస్తువులు కలిపి రూ. 8.27 కోట్లను స్వాధీనం చేసుకున్నాం. పోలింగు సందర్భంగా ఆటంకాల కారణంగా ఆరు బ్యాలెట్‌, మూడు కంట్రోల్‌ యూనిట్లు, తొమ్మిది వీవీప్యాడ్స్‌ను మార్చాం. ఓటింగ్‌ యంత్రాలను స్ట్రాంగ్‌ రూములో భద్రం చేస్తాం. ఆదివారం ఓట్ల లెక్కింపు కోసం ప్రణాళిక సిద్ధం చేశాం.

Tags:    

Similar News