Warangal: వరంగల్‌ జిల్లాను వేధిస్తున్న సీజనల్ వ్యాధులు

* జిల్లాలో పడకేసిన పరిశుభ్రత * జిల్లా ప్రజలను వెంటాడుతున్న వైరల్ ఫీవర్ * రోగులతో కిటకిటలాడుతున్న వరంగల్‌ ఎంజీఎం

Update: 2021-08-13 07:16 GMT

వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ (ఫైల్ ఫోటో)

Warangal: వైరల్, సీజనల్ వ్యాధులు వరంగల్ జిల్లా ప్రజలను వెంటాడుతున్నాయి. మలేరియా, డెంగీ, టైఫాయిడ్ లాంటి విషజ్వరాలు జిల్లాను వేధిస్తున్నాయి. పట్టణం, పల్లె అన్న తేడాలేదు. అన్ని ఏరియాల్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో ఎంజీఎం రోగులతో కిటకిటలాడుతోంది. బెడ్స్ దొరికే పరిస్థితి లేదు. ఇక అందరికీ పరీక్షలు చేయడం కష్టతరంగా మారింది. దీంతో ప్రైవేట్‌ ల్యాబ్‌లను ఆశ్రయించక తప్పడం లేదు. ఇటు ప్రైవేట్‌ ఆస్పత్రులు కూడా నిండుకుంటున్నాయి. ఇదే అదనుగా భావించిన కొందరు ప్రైవేట్‌ వైద్యులు వసూల్‌ రాజాలుగా మారారు.

వరంగల్ నగరంలో పరిశుభ్రత లోపించింది. ప్రతి వీధిలో చెత్తకుప్పలు గుట్టలుగా పేరుకపోయాయి. కుక్కలు, పందులు, దోమలు, ఈగల విజృంభన మాములుగా లేదు. దీనికితోడు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. చిన్న చినుకుకే డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. ఇళ్లల్లోకి చేరి కంపులేపుతున్నాయి.

వరంగల్‌ నగరంలో దోమల నివారణకు మహానగరపాలక సంస్థ 5కోట్లు ఖర్చు చేసింది. ఐనా ఎక్కడి దోమలు అక్కడే తిష్టవేశాయి. నిధులు వృధా తప్పా ప్రయోజనం శూన్యం. అపరిశుభ్రత కారణంగా అనారోగ్యాలు వేధిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన చికిత్స దొరకడం లేదు. దీంతో జిల్లాల పేద ప్రజలు బతుకులు ఆగం అవుతున్నాయి.

ఓపక్క కరోనా భయంతో ఆందోళన. ఇప్పుడు విషజ్వరాలతో నగర ప్రజలు బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, జిల్లా యంత్రాంగం, బల్దియా అధికారులు సీజనల్ వ్యాధులపై దృష్టిసారించాలని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News