Telangana News Today: తెలంగాణను వణికిస్తున్న విషజ్వరాలు
Telangana News: * ప్రజలను వేధిస్తున్న సీజనల్ వ్యాధులు * రోగులతో కిటకిటలాడుతున్న ఆస్పత్రులు * పెరుగుతున్న డెంగీ కేసులు
Telangana News Today: తెలంగాణ రాష్ట్రాన్ని వైరల్ ఫివర్స్ వణికిస్తున్నాయి. డెంగీ కేసులైతే డేంజర్‌గా నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని ఏ పల్లెను వదిలిపెట్టడం లేదు. ఇటు హైదరాబాద్‌లో కూడా సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. దీంతో ఏ ఆస్పత్రి చూసినా రోగులతోనే కిక్కిరిపోయి కనిపిస్తోంది.
సీజన్ ఛేంజ్ అయితే ఇన్‌ఫెక్షన్లు సోకడం సహజం. అయితే ఈసారి చల్లటి వాతావరణం వైరస్‌ల పెరుగుదలకు అనుకూలంగా ఉంది. దీంతో వైరల్ ఇన్ఫెక్షన్, జ్వరాల ఉద్ధృతి ఎక్కువగా ఉంది. మరోవైపు దోమల బెడద కూడా తీవ్రంగా ఉండడంతో డెంగీ కేసుల రోజురోజుకు పెరుగుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, కొత్తగూడెం జిల్లాల్లో అధికంగా డెంగీ కేసులు నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లో 447 డెంగీ కేసులు, ఖమ్మంలో 134 కేసులు, రంగారెడ్డిలో 110 కేసులు నమోదయ్యాయి.
ఇక ములుగు, భద్రాద్రి జిల్లాలను మలేరియా భయపెడుతోంది. ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అయితే సీజనల్ వ్యాధులను అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నామని హెల్త్‌డైరెక్టర్ శ్రీనివాస్ వెల్లడించారు. అయతే ప్రజల భాగస్వామ్యం అవసరమని ఆయన కోరారు.