Telangana: తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు ప్రారంభం
* పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ, శానిటైజేషన్ పనులు * స్కూళ్లను శుభ్రం చేస్తున్న మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖలు * ఓవైపు స్కూళ్ల రీఓపెన్.. మరోవైపు థర్డ్‌వేవ్ హెచ్చరికలు
Telangana: సెప్టెంబర్ 1 వస్తుంది. ఇక బడిగంట మోగనుంది. అందుకోసం విద్యాసంస్థలు రెడీ అవుతున్నాయి. మరీ విద్యార్థులు బడి బాట పడతారా తల్లిదండ్రులు పిల్లలను పంపించడానికి సిద్ధంగా ఉన్నారా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా విద్యాసంస్థలు సిద్ధమవుతున్నాయి. రేపటిలోగా పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ, శానిటైజేషన్ పూర్తి చేసేందుకు మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖలు రంగంలోకి దిగాయి. పాఠశాలలో అన్నింటిని శుభ్రం చేసి శానిటైజ్ చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఓ పక్క స్కూళ్లను తెరిచేందుకు రెడీ అవుతోంది. మరోపక్క థర్డ్‌వేవ్ హెచ్చరికలు వినిపిస్తున్నాయి. దీంతో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపించాలా వద్దా అనే సంకోచంలో పడిపోయారు. కొందరు పేరెంట్స్ మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. పిల్లలు చదువు విషయంలో నష్టపోతున్నారని తల్లిదండ్రులు అంటున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు నిర్వహిస్తే తమ పిల్లలను బడికి పంపిస్తామంటున్నారు.