Schools Reopen: తెలంగాణలో ప్రారంభమైన పాఠశాలలు
Schools Reopen: తెలంగాణలోని పలు జిల్లాల్లో పాఠశాలలు తెరుచుకున్నాయి.
నాగర్ కర్నూలు జిల్లా:
తెలంగాణలో స్కూల్స్ తిరిగి ప్రారంభం అయ్యాయి. నాగర్ కర్నూలు జిల్లా సోమశిల గ్రామంలో విద్యార్ధులకు ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు.. డప్పు దరువులతో, పూలు వెదజల్లుతూ చప్పట్ల నడుమ విద్యార్థులను పాఠశాలలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, గ్రామ సర్పంచ్ పాల్గొన్నారు.
వరంగల్ జిల్లా:
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఏడాదిన్నర తర్వాత స్కూల్స్ ఓపెన్ కావడంతో.. కోవిడ్ భయం విద్యార్థుల తల్లిదండ్రులను వెంటాడుతోంది
ఆదిలాబాద్ జిల్లా:
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విద్యాసంస్థలు తెరుచుకున్నాయి. చాలా గ్యాప్ తర్వాత స్టూడెంట్స్ స్కూల్ బాటపట్టారు. ఇవాళ్టి నుంచి విద్యార్థులకు ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కొవిడ్ రూల్స్ పాటిస్తూ క్లాసులు నిర్వహిస్తున్నారు. ప్రతి విద్యార్థి తప్పకుండా మాస్క్ ధరించాలని సూచించారు. తరగతి గదుల్లో ఇప్పటికే శానిటేషన్ చేశారు. బెంచ్‌కు ఒకరి చొప్పున కూర్చోబెడుతున్నారు. విడతల వారీగా మధ్యాహ్న భోజనం చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.