School Innovation Challenge exhibition: పిల్లల ఆలోచనలను ప్రోత్సహించాలి: కేటీఆర్
School Innovation Challenge exhibition: * టాలెంట్ ఎవరి సొత్తు కాదని నిరూపించిన విద్యార్ధులు * ఇంజినీరింగ్ కోర్సుల తరహాలో అప్రెంటీస్ విధానం
School Innovation Challenge exhibition: వారంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. టాలెంట్ ఎవరి సొత్తు కాదని నిరూపించారు. కార్పొరేట్ స్కూల్స్ విద్యార్ధులకు ఏమాత్రం తీసిపోని విధంగా వారి ఆవిష్కరణలు చేశారు. తమ ఆలోచనలకు పదును పెట్టి కొత్త ఆవిష్కరణలు తయారు చేశారు. పిల్లలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి విద్యాశాఖ ఎగ్జిబిషన్‌ను నిర్వహించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి బహుమతులు అందించారు.
పిల్లలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి విద్యాశాఖ స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్ ఎగ్జిబిషన్ నిర్వహించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తమ ఆలోచనలతో ఆకట్టుకున్నారు. తెలంగాణలోని మొత్తం 33 జిల్లాల్లో 5, 067 మంది హైస్కూల్ ఉపాధ్యాయులతో పాఠశాలల్లో మేనేజింగ్ డిజైన్ థికింగ్ ఇన్నోవేషన్‌ను నిర్వహించారు. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ , తెలంగాణ ప్రభుత్వం, యునిసెఫ్ మరియు ఇంక్వి-ల్యాబ్ ఫౌండేషన్ సహకారంతో, పాఠశాల స్థాయి ఇన్నోవేషన్ ఛాలెంజ్‌ను ప్రారంభించారు.
ఈ 21 వ శతాబ్దపు నైపుణ్యాలను విద్యార్థులకు, ఉపాధ్యాయలకు పరిచయం చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రం మార్గదర్శకంగా ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్ ను గత ఆగస్టు 28 న ప్రారంభించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ పోర్టల్ లో నమోదు చేసుకున్నాయి. 6 నుంచి 10 తరగతుల నుండి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు డిజైన థింకింగ్ పర్ ఇన్ఫనో వేషన్' పై ఆన్‌లైన్ మాడ్యూల్ పూర్తి చేసి సర్టిఫికెట్లు పొందారు.
తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ దాలెంట్ -2020(School Innovation Challenge exhibition) లో భాగంగా మొత్తం 7,093 వినూత్న ఆలోచనలను విద్యార్థులు సమర్పించారు. దీనిలో 25 పాఠశాలలు ప్రాక్టికల్ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లోని MCRHRDలో జరిగిన ఆ కార్యక్రమంలో ఐటి మినిస్టర్ కేటిఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. విద్యార్దులు కొత్త ఆలోచనలతో చేసిన పరికరాలను పరిశీలించారు.
పాఠశాల కరికులంలో ఆవిష్కరణలను ఒక అంశంగా ప్రవేశపెట్టాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఇంజినీరింగ్ కోర్సుల తరహాలో పాఠశాల స్థాయిలోనే సృజనాత్మకతకు పెద్దపీట వేయాలన్నారు. అప్రెంటిస్‌షిప్, ప్రాక్టీస్ స్కూల్.. ఇలా ఏదో ఒక పేరుతో మార్కులివ్వడం తోపాటు, స్కూళ్లతో పరిశ్రమలను అనుసంధానంచేసే అంశాన్ని సైతం పరిశీలించాలన్నారు.విద్యార్దుల్లో ఉన్న సృజనాత్మకతను బయటకు తీయడానికి ఈ ప్రోగ్రాం ఎంతగానో ఉపయోగనపడుతుంది అంటున్నారు ఉపాద్యాయులు.