Mahabubnagar: వరదనీటిలో చిక్కుకున్న స్కూల్ బస్సు..
Mahabubnagar: మహబూబ్ నగర్ జిల్లాలో పెనుప్రమాదం తప్పింది.
Mahabubnagar: మహబూబ్ నగర్ జిల్లాలో పెనుప్రమాదం తప్పింది. ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు వరద నీటిలో చిక్కుంది. వెంటనే స్థానికులు స్పందించి విద్యార్థులను కాపాడటంతో ప్రమాదం తప్పింది. రాత్రి కురిసినా వర్షం కి మాన్యంకొండ దగ్గర సుగురగడ్డ తండా సమీపంలో నూతనంగా నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జి కింది భాగంలో బారీగా వర్షం నీరు నిలిచింది. నీరు భారీగా చేరడంతో దారి ముసుకుపోయింది.
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరిచి బస్సును ఒక్కసారిగా రైల్వే అండర్ బ్రిడ్జిలోకి తీసుకువెళ్లాడు. భారీ వర్షం నీరు ఉండటంతో మార్గం మద్యలోనే బస్సు ఆగిపోయింది. ఒక్కసారి వర్షం నీరు బస్సులోకి వచ్చాయి. ప్రమాదం సమయంలో బస్సులో మొత్తం 30 మంది చిన్నారులు ఉన్నారు. బస్సు ఒక్కసారిగా వరద నీటిలోకి వెళ్లడంతో ఏం జరుగుతుందో తెలియక విద్యార్థులు కేకలు పెట్టారు. వారి అరపులు విని, అటుగా వెళ్తున్న స్థానికులు వెంటనే స్పందించి పిల్లలను కాపాడారు. బస్సులో నుంచి స్కూల్ పిల్లను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో పెనుప్రమాదం తప్పింది.