Satyavathi Rathod: సైదాబాద్ ఘటన చాలా దారుణం
Satyavathi Rathod: చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేయడం దురదృష్టకరం * త్వరలోనే నిందితుడు రాజును కఠినంగా శిక్షిస్తాం
Satyavathi Rathod: హైదరాబాదు లోని సైదాబాద్ కాలనీలో చిన్నారి చైత్ర పై అత్యాచారం చేసి, హత్య చేయడం దారుణమని, అత్యంత దురదృష్టమనీ రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ ఘటన జరిగిన రోజు నుంచి ప్రతి రోజూ డీజీపీ సీపీలతో మాట్లాడుతున్నానని చెప్పారు. పది పోలీస్ బృందాలు నిందితుడి కోసం గాలిస్తున్నాయని, కచ్చితంగా దోషులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లాలో నూతన మహబూబాబాద్ జిల్లా నూతన సమీకృత కలెక్టర్ కార్యాలయం నిర్మాణం, పనులు మెడికల్ కాలేజ్ కేటాయించిన స్థలాన్ని రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడారు. చైత్ర ఘటన జరిగిన వెంటనే చర్యలు వేగవంతం చేశామని బాధిత కుటుంబాన్ని ఆదుకోవడం, దోషులను శిక్షించే పనిలో ఉన్నామని సత్యవతి అన్నారు.
ఘటన జరిగిన రోజు నుంచి ప్రతిరోజు డీజీపీ, సీపీతో మాట్లాడుతున్నామని పది పోలీస్ టీమ్స్ దీని మీద పని చేస్తున్నాయని మంత్రి చెప్పారు.నిందితుని కుటుంబ సభ్యులు పోలీసుల కంట్రోల్ లో ఉన్నారని దోషులను పట్టుకుంటామని కఠినంగా శిక్షిస్తామన్నారు. మహబూబాబాద్ లో 3000 ఎకరాల పైచిలుకు ప్రభుత్వ భూమి ఉండేదని కొంత ప్రభుత్వ భూమిని పేదలకు అసైన్డ్ చేశామని భూములలో ఉన్న వారికి న్యాయం చేస్తామని రికార్డు లు లేని వారికే ఇబ్బంది అవుతుందని మంత్రి చెప్పారు అయినా ఎవరికీ నష్టం జరగకుండా చూస్తామన్నారు. మహబూబాబాద్ అత్యధిక గిరిజనులు ఉన్న జిల్లా ఈ ప్రాంతానికి మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ రావడంతో సూపర్ స్పెషాలిటీ వైద్యం రానుందని ఈ క్రమంలో ఎవరికీ ఇబ్బంది అయినా వారికి నష్టం లేకుండా చూస్తామన్నారు.