Sankranthi: ప్రత్యేక బస్సులు నడిపేందుకు తెలంగాణ ఆర్టీసి సిద్దం

Sankranthi: ఈ నెల 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఏపీ, తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు 4,980 ప్రత్యేక బస్సులు

Update: 2021-01-05 03:04 GMT

TSRTC Bus (file image)

Sankranthi: సంక్రాంతి పండగను పురస్కరించుకొని ప్రత్యేక బస్సులు నడిపేందుకు తెలంగాణ ఆర్టీసీ సిద్ధమయ్యింది. ఈ నెల 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఏపీ, తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు 4,980 ప్రత్యేక బస్సులను నడపనున్నది. కోవిడ్ తర్వాత వస్తున్న అతి పెద్ద పండుగ కావడంతో హైదరాబాదులో నివసిస్తున్న ఆంధ్ర ప్రాంత వాసులు పెద్ద ఎత్తున సొంతూళ్లకు వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటుడడంతో తెలంగాణ ఆర్టీసీ భారీగా ప్రత్యేక బస్సులు ప్రకటించింది..

తెలుగు ప్రజలు అత్యంత వేడుకగా జరుపుకునే సంక్రాంతి(Sankranthi) పండగకు సొంతూర్లకు వెళ్లేందుకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నుంచి తెలంగాణ, ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు మొత్తం 4, 980 బస్సులు నడపనున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. ఈనెల 8 నుంచి 14వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నారు. తెలంగాణలో 3,380, ఏపీలోని వివిధ ప్రాంతాలకు 1600 ప్రత్యేక బస్సులు నడుపనున్నారు.

హైదరాబాద్ ఎంజీ బస్‌ స్టేషన్‌, జూబ్లీ బస్‌ స్టేషన్‌, సెంట్రల్‌ బస్‌ స్టేషన్‌, ఉప్పల్‌ క్రాస్‌రోడ్‌, ఎల్బీనగర్‌, చందానగర్‌, కేపీహెచ్‌పీ, లింగంపల్లి, అమీర్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌, ఎస్‌ఆర్‌ నగర్‌ తదితర బస్ స్టేషన్‌లతో పాటు జంటనగరాల్లోని శివా రు ప్రాంతాల్లో నివసించే వారికి సమీపంలోని ముఖ్యమైన పాయింట్ల నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు రంగారెడ్డి జిల్లా ఆర్టీసీ రీజీనల్ మేనేజర్ వరప్రసాద్ తెలిపారు.

వాయిస్() ఏపీలోని విజయవాడ, విజయనగర్‌, రాజమండ్రి, గుడివాడ, గుంటూరు, తెనాలి, కాకినాడ, రాజోలు, మచిలిపట్నం, పోలవరం, ఏలూరు, తాడేపల్లి గూడెం, తణుకు, విశాఖ, భీమవరం, శ్రీకాకుళం, నర్సాపురం, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరు, తిరుపతి, ఉదయగిరి తదితర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు తెలంగాణ ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. అలాగే పండగకు వెళ్లేవారి కోసం అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. www.tsrtconline.in వెబ్‌సైట్‌ ద్వారా రిజర్వేషన్‌ చేసుకోవచ్చని సూచించారు.

మరోవైపు ఆర్టీసీ బస్సు లోనే కాకుండా హైదరాబాద్ నుండి దూరప్రాంతాలకు వెళ్లడానికి ఆంధ్ర ప్రదేశ్ కి 29 ప్రత్యేక రైళ్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇందుకోసం విడతలవారీగా రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు ఇప్పటికే దసరా పండగ తర్వాత నడుస్తున్న ప్రత్యేక రైళ్లను కొనసాగిస్తూనే ప్రయాణికుల రద్దీ మరిన్ని రైళ్లు నడిచేలా ప్రణాళికలు రూపొందిస్తోంది.

 దాదాపు పది నెలల తర్వాత కోవిడ్ నేపథ్యంలో హైదరాబాద్ లోనే ఉండిపోయిన చాలామంది సొంత ప్రాంతాలకు వెళ్లడానికి సంక్రాంతి పండుగ దృశ్య సిద్ధమవుతున్నారు. ఇందుకోసం తెలంగాణ ఆర్టీసీ తో పాటు దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక సౌకర్యాలు కల్పించింది... ప్రయాణికులు కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు.

Tags:    

Similar News