కంచుతాళం-కంచు మేళంతో పాపులర్ అయిన రామచంద్రయ్య
Sakini Ramachandraya: పద్మశ్రీ రావడం ఎంతో ఆనందంగా ఉంది-సకిని రామచంద్రయ్య
Sakini Ramachandraya: నమ్ముకున్న కళ అవార్డు తెచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు జానపద కళాకారుడు సకిని రామచంద్రయ్య. కోయదొర వంశానికి చెందిన రామచంద్రయ్య స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు మండలం కూనవరం. కంచుతాళం కంచు మేళంతో మేడారం జాతరలో కోయ జానపదాన్ని ఆలపించి భక్తులను భక్తిసాగరంలో ముంచెత్తుతారు. పద్మశ్రీ అవార్డు ప్రకటించటంతో ఇప్పుడు కంచుతాళం కంచుమేళం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. తనకు పద్మశ్రీ అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉందంటున్నారు రామచంద్రయ్య.