తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం.. పార్టీ ఫిరాయింపులపై సభ్యుల మధ్య మాటలయుద్ధం
Revanth Reddy: పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ అసెంబ్లీని కుదిపేసింది.
Revanth Reddy: పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ అసెంబ్లీని కుదిపేసింది. సీఎం రేవంత్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మధ్య వాగ్వాదం సభను హీటెక్కించింది. సబితా ఇంద్రారెడ్డిపై పరోక్షంగా రేవంత్ వ్యాఖ్యలు చేయగా... అందుకు తానేం అన్యాయం చేశానంటూ భావోద్వేగానికి గురయ్యారు సబితా ఇంద్రారెడ్డి.
సీఎం రేవంత్ తనను టార్గెట్ చేశారంటూ సబితా ఇంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పదవుల కోసం పార్టీ మారి.. సీఎల్పీ లేకుండా చేశారన్నారు. ఇప్పుడు ఏం ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నారంటూ సబితా ఇంద్రారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు భట్టి. బాధ పడాల్సింది, ఆవేదన చెందాల్సింది తామని.. సబితా ఇంద్రారెడ్డి కాదని అన్నారు.