Rythu Bandhu Scheme: తెలంగాణలో రైతుబంధుకి ఇవాళే అఖరి రోజు..
Rythu Bandhu Scheme: తెలంగాణలో ఖరీఫ్ సీజను పనులు ప్రారంభమయ్యాయి.రైతులు రైతుబంధు పథకం దరఖాస్తు చేసుకోవడానికి ఇవాళ్టితో ప్రభుత్వం ఇచ్చిన గడువు మ్ముగుస్తుంది.
Rythu Bandhu Scheme: తెలంగాణలో ఖరీఫ్ సీజను పనులు ప్రారంభమయ్యాయి.రైతులు రైతుబంధు పథకం దరఖాస్తు చేసుకోవడానికి ఇవాళ్టితో ప్రభుత్వం ఇచ్చిన గడువు మ్ముగుస్తుంది. రేపటి నుంచి దరఖాస్తు పెట్టుకోవడానికి వీలుండదు. ప్రభుత్వం రైతులకు ఇస్తున్న రైతు బంధు పథకం ఆర్థిక సాయాన్ని పొందగలరు. ఇప్పటికే దరఖాస్తు చేసుకుంటే సరైన వివరాలు ఇచ్చింది లేనిది పరిశీలించుకోవాలి. తెలంగాణలోని రైతులు పసుపు, మొక్కజొన్న, సొయా విత్తనాలు విత్తే పనిలో పడ్డారు. వరి పంటను సాగు చేయడానికి నారు సిద్ధం చేసుకుంటున్నారు. విత్తనాలు, ఎరువులను ఇప్పటికే కొందరు రైతులు కొనుగోలు చేయగా, మరి కొందరు రైతులు కొనుగోలు చేయడానికి ఏర్పా ట్లు చేసుకుంటున్నారు.
ప్రభుత్వం జనవరి 23 లోపే రైతులకు రైతుభందు దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది. అయితే రైతులందరూ అప్లై చేసుకోలేకపోయారు. కరోనా వ్యాప్తి చెందడంతో రైతులు కటాఫ్ తేదీని పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. దాంతో ప్రభుత్వం జూన్ 16 వరకూ కటాఫ్ తేదీని ప్రకటించింది. అందువల్ల ఆలోపు అప్లై చేసుకున్న రైతులు పట్టా పాస్ పుస్తకాలు పొంది ఈ పథకానికి అర్హులుగా మారారు. ఇక్కడో సమస్య వచ్చింది. రైతుల్లో చాలా మంది పట్టాదారు పాస్ పుస్తకం నంబర్లు, ఖాతా నంబరలు, ఆధార్ సంఖ్యలు, బ్యాంక్ IFSC కోడ్ నంబర్లు సరిగా ఇవ్వలేదు. ఇలాంటి రైతులు దాదాపు 5 లక్షల మంది ఉన్నారు. 35 వేల మంది రైతులకు ప్రభుత్వం డబ్బు బదిలీ చేస్తే... వాళ్ల బ్యాంక్ అకౌంట్ నంబర్లు సరిగా లేకపోవడంతో డబ్బులు ప్రభుత్వానికి వెనక్కి వచ్చేశాయి. ఇవన్నీ గమనించిన అధికారులు మంత్రులతో చర్చించి మరికొంత గడువు పెంచారు. జులై 5 నాటికి పూర్తి సమాచారం ఇవ్వాలని చెప్పారు.
కాగా..ఇవ్వాల్టితో అన్నీ కరెక్టుగా సమర్పించిందీ లేనిదీ చెక్ చేసుకోవాలి. సరైన వివరాలు ఇచ్చినట్లుగా నిర్ధారణ చేయించుకోవాలి. తద్వారా... 56,94,185 మంది రైతులకు 7,183.67 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఈ వానాకాలంలో పంటల కోసం రైతులకు ఇవ్వనుంది. బ్యాంక్ అకౌంట్ నంబర్లు సరిగా లేకపోవడంతో...మరోవైపు కరోనా సమస్యతో రైతుబంధు నిధులు ఆలస్యం కావడంతో రైతులకు ఎదురు చూపులు తప్పడం లేదు. రైతుబందు అప్లై కి ఇవాళ్టి తో గడువు ముగుస్తుంది. దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ రైతుబంధు నిధులు ఖాతాల్లోకి చేరుతాయినీ అధికారులు వెల్లడించారు.