Warangal: వరదనీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు.. రాత్రంతా బస్సులోనే ప్రయాణికులు..!
Warangal: వరంగల్-మహబూబాబాద్ రహదారిపై వరద ఉధృతి కొనసాగుతోంది. అయితే.. వెంకటాపురం వద్ద చెరువులో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది.
Warangal: వరంగల్-మహబూబాబాద్ రహదారిపై వరద ఉధృతి కొనసాగుతోంది. అయితే.. వెంకటాపురం వద్ద చెరువులో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. రాత్రి నుంచి బస్సులోనే 45 మంది ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తమను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ గ్రామానికి చేరుకున్నారు. ట్రాక్టర్ సహాయంతో ప్రయాణికులను రక్షించి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు తరలించారు. వర్షం తగ్గిన తర్వాత వారి గమ్యస్థానాలకు తరలిస్తామని కలెక్టర్ తెలిపారు.
ప్రయాణికులకు తినడానికి తిండి ఉండడానికి వెంకటాపురం గ్రామ సమీపంలో వసతిని ఏర్పాటు చేశారు..భారీ వర్షాలు మరో రెండు, మూడురోజులపాటు కొనసాగనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమమతంగా ఉండాలని హెచ్చరించింది వాతావరణశాఖ. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని తెలిపారు అధికారులు.