Telangana: తెలంగాణలో పెరిగిన మద్యం ధరలు, నేటి నుండి అమల్లోకి

Telangana: తెలంగాణలో 20 శాతానికిపైగా పెరిగిన మద్యం ధరలు

Update: 2022-05-19 03:15 GMT

Telangana: తెలంగాణలో పెరిగిన మద్యం ధరలు 

Telangana: తెలంగాణలో మద్యం ప్రియులకు చేదు వార్త చెప్పింది ఎక్సజ్ శాఖ. మద్యం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. కరోనా తరువాత ధరలు పెంచిన ప్రభుత్వం మరోసారి రాష్ట్ర ఆదాయం కోసం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి.

తెలంగాణలో మద్యం ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలు గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి. మద్యం షాపలు, బార్లు, పబ్స్, క్లబ్స్ లో మద్యం స్టాక్ ని లెక్కించి సీజ్ చేశారు అధికారులు. మద్యం లెక్కలను సేకరించిన అనంతరం పెరిగిన ధరలతో అమ్ముకోవాలని అధికారులు సూచించారు. బుధవారం సేల్స్ అయి పోగానే సీజ్ చేశారు అధికారులు. కనీసం 10 శాతం పెంపు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

తెలంగాణలో బీర్లు, మద్యం ధరలు పెరిగాయి. ఒక్కో బీరుపై 20 రూపాయలు, మద్యం క్వాటర్ పై 20 రూపాయలు, ఆఫ్ బాటిల్ పై 40 రూపాయలు, ఫుల్ బాటిల్ పై 80 రూపాయలు పెంచుతున్నట్లు ప్రకటించింది ఎక్సైజ్ శాఖ. కరోనా తరువాత మద్యం ధరలు పెంచింది ప్రభుత్వం. మరోసారి తాజాగా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.ఈ మద్యం ధరలు పెంపుతో ప్రభుత్వానికి ఆదాయం వచ్చినా మద్యం ప్రియులకు మాత్రం చేదువార్తను అందించింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికీ మద్యం అమ్మకాల ద్వారా భారీగా ఆదాయం చేకూరుతుంది. ఈసారి పెంపుతో రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం చేకూరనుంది. దీంతో పథకాలు అమలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇవ్వగలుగుతామని ప్రభుత్వం భావిస్తోంది. మద్యంతో పాటు ఇతర ఆదాయం వచ్చే వనరులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సాధించిన నేపథ్యంలో భూముల అమ్మకాలపై తొందర్లోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర ఖజానా నింపుకోవడానికి ప్రభుత్వం ఇంకా ఇలాంటి మార్గాలపై దృష్టి పెడుతుందో వేచి చూడాలి. 

Tags:    

Similar News