Revanth Reddy: జనగామ గడ్డ కాంగ్రెస్ అడ్డా
Revanth Reddy: పేదలందరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం
Revanth Reddy: జనగామ గడ్డ కాంగ్రెస్ అడ్డా అని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమం, సాయుధ పోరాటంలో జనగామ ప్రజలది ప్రత్యేక స్థానమని చెప్పారు. పొన్నాల లక్ష్మయ్యను కాంగ్రెస్ పార్టీ 47ఏళ్లపాటు మోసిందని అన్నారు. పొన్నాల లక్ష్మయ్య పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిల మారిందన్నారు.
కట్టు బానిసలుగా ఉండే ఎమ్మెల్యేలు ఉండాలని కేసీఆర్ కోరుకుంటారని... అందుకే జనగామలో పల్లాను నిలబెట్టారని తెలిపారు. కేసీఆర్ ఈ పదేళ్లలో ఎంతమందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించారని రేవంత్ ప్రశ్నించారు. కాంగ్రెస్ గెలిస్తే పేదలందరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులకు యువ వికాసం కింద 5లక్షలు ఇస్తామన్నారు రేవంత్‌రెడ్డి.