Revanth Reddy: రైతుల ఆత్మహత్యల్లో.. బెల్టు షాపుల్లో తెలంగాణను నంబర్ వన్ చేశారు
Revanth Reddy: కేసీఆర్ చెప్పడానికి చేసిందేమీ లేదు, అందుకే కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారు
Revanth Reddy: కేసీఆర్ కుటుంబంలో అందరికి ఉద్యోగాలు వచ్చాయని, వాళ్ళు బంగారు పళ్లెంలో తింటూ బంగారు తెలంగాణ అంటున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధ‌్వజమెత్తారు. నర్సాపూర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన.. రైతుల ఆత్మహత్యల్లో, బెల్టు షాపుల్లో తెలంగాణను నంబర్ వన్ చేశాడని కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. నర్సాపూర్ గడ్డ.. లంబాడీల అడ్డ, తాము అధికారంలోకి వస్తే తండాల అభివృద్ధికి 100 కోట్లు కేటాయిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. 12 లక్షల పోడు భూముల పట్టాలు ఇచ్చింది ఇందిరమ్మ రాజ్యం అన్నారు. కేసీఆర్ చెప్పడానికి చేసిందేమీ లేదని, అందుకే కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారని రేవంత్ ఫైర్ అయ్యారు.