Revanth Reddy: ఏ పదవి ఇచ్చిన సీతక్క తర్వాతే : రేవంత్ రెడ్డి

Revanth Reddy: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి ఎవరికీ దక్కుతుందో అని కొన్ని నెలల ఉత్కంఠకి తెరదించిన కాంగ్రెస్ అధిష్టానం.

Update: 2021-06-30 09:31 GMT

ఏ పదవి ఇచ్చిన సీతక్క తర్వాతే : రేవంత్ రెడ్డి

Revanth Reddy: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి ఎవరికీ దక్కుతుందో అని కొన్ని నెలల ఉత్కంఠకి తెరదించిన కాంగ్రెస్ అధిష్టానం ఇటీవలే రేవంత్ రెడ్డి ని టిపిసిసి అధ్యక్షుడిగా నియమిస్తు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.. అధ్యక్షుడి ప్రకటన తర్వాత తెలంగాణా కాంగ్రెస్ లో పలువురు నాయకులు పలు రకాలుగా స్పందించారు. ఇతర పార్టీ నుండి కాంగ్రెస్ లోకి వచ్చిన అతి తక్కువ సమయంలో అధ్యక్ష పదవి ఎలా ఇస్తారని కొందరు, రేవంత్ రెడ్డి అయితేనే ప్రస్తుత పరిస్థితుల్లో అధ్యక్ష పదవికి సరైన వాడు అని మరికొందరు ఇలా కొందరు అలకతో, మరికొందరు సంతోషంతో తమ మనోభావాలను తెలుపగా మరో పక్క రేవంత్ రెడ్డి మాత్రం ఇవేం పట్టించుకోకుండా పార్టీ లోని ముఖ్య నాయకులను కలుస్తూ అందరం కలిసి పనిచేసి పార్టీని బలోపేతం చేయాలనీ కోరుతున్నారు.

మంగళవారం సమ్మక్క సారలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ములుగు శాసన సభ్యురాలు సీతక్క జూబ్లీ హిల్స్ లో ఉన్న కాంగ్రెస్ క్యాంపు ఆఫీస్ లో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని 100 కార్లతో ర్యాలీగా బయలుదేరి వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ తనకి కూడా రేవంత్ రెడ్డి టీంలో అవకాశం రానందుకు కాస్త అసంతృప్తిగా ఉన్నా కూడా పార్టీకి ఎవరి అవసరం ఉందో, ప్రజా మరియు పార్టీ నాయకుల అభిప్రాయ సేకరణ తర్వాతే రేవంత్ రెడ్డికి ఆ పదవి దక్కిందని ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శుభాకాంక్షలు తెలిపింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సీతక్క తర్వాతే తనకి ఏ పదవి అయిన అని, ఇక తన అధ్యక్ష పదవి రాకుండా కేసిఆర్ చాలా ప్రయత్నాలు చేసాడని కాని సోనియా గాంధీ గారు తనపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చారని నాపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయనని ఆయన తెలిపారు.

ఇక రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాల్లో జరుగుతున్న అక్రమాలపై కెసిఆర్ ని విమర్శించాడు. త్వరలోనే కేసిఆర్ చేతుల నుండి తెలంగాణా రాష్ట్రాన్ని విముక్తి చేస్తానని తెలిపాడు. మరోపక్క కోమటి రెడ్డి బ్రదర్స్ మాత్రం అధిష్టానం తీసుకున్న నిర్ణయం పై పూర్తిగా అసంతృప్తి తో ఉన్నట్టు బహిరంగంగానే ప్రకటన చేసిన విషయం తెలిసిందే..బుధవారం టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసి అభినందనలు తెలిపిన కొండ సురేఖకి తమతో కలిసి పనిచేసేందుకు సుముఖంగా ఉన్నట్లు రేవంత్ ట్వీట్ చేసారు.

Tags:    

Similar News