Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హౌస్ అరెస్ట్
Revanth Reddy: ఓయూలో నిరుద్యోగ దీక్షకు హాజరయ్యేందుకు సిద్ధమైన రేవంత్‌రెడ్డి
Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రేవంత్ నివాసం వద్ద భారీగా మోహరించారు. రేవంత్ ఇంటికి వెళ్లే అన్ని దారులను మూసివేశారు. ఇవాళ ఓయూలో నిరుద్యోగ దీక్ష చేపట్టారు విద్యార్థి సంఘాలు. దీక్షకు రావాలని రేవంత్‌రెడ్డిని ఆహ్వానించారు. అయితే ఓయూలో నిరుద్యోగ దీక్షకు అనుమతి లేకపోవడంతో.. రేవంత్ ఓయూకు వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే ఓయూలో విద్యార్థి సంఘం నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు.