Revanth Reddy: ఒక ఆడబిడ్డ ఇక్కడ పోటీ చేస్తుంటే ..రాజయ్య, శ్రీహరి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు

Revanth Reddy: కేసీఆర్ ప్రభుత్వం నేల కూలాల్సిన సమయం వచ్చింది

Update: 2023-11-14 13:18 GMT

Revanth Reddy: ఒక ఆడబిడ్డ ఇక్కడ పోటీ చేస్తుంటే ..రాజయ్య, శ్రీహరి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు

Revanth Reddy: మాజీ డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, రాజయ్యపై పీసీసీ రేవంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు. ఒక ఆడబిడ్డ పోటీ చేస్తుంటే శ్రీహరి, రాజయ్య ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. రాజయ్య, శ్రీహరి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో కాంగ్రెస్ సభలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఇద్దరు ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఇద్దరు జాతకాలు తెలుసు కాబట్టే కేసీఆర్ ఉద్యోగం ఇచ్చి మధ్యలోనే ఊడగొట్టిండని అన్నారు. కేసీఆర్‌కే వీళ్లపై నమ్మకం లేదు.. ప్రజలకు ఎలా నమ్ముతారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం నేల కూలాల్సిన సమయం వచ్చిందన్నారు.

Tags:    

Similar News