భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న రేవంత్.. కేసీఆర్ వద్ద డబ్బులు తీసుకుంటే.. ఆయన కళ్లలోకి చూసే ధైర్యం నాకుండేదా?
Revanth Reddy: నేను హిందువును... దేవుడిని నమ్ముతా
Revanth Reddy: పాతిక కోట్ల పంచాయితీ హీట్ తెలంగాణలో తారా స్థాయికి చేరుకుంది. కాంగ్రెస్ పార్టీపై ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలపై ప్రమాణం చేసేందుకు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వచ్చారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా భావోద్వోగ ప్రసంగం చేశారు రేవంత్ రెడ్డి. మునుగోడు ఎన్నికల్లో నిఖార్సైన అభ్యర్థిని నిలబెట్టామన్నారు. మునుగోడు ఎన్నికల్లో బీఆర్ఎస్ వందల కోట్లు ఖర్చుపెట్టాయన్నారు.
చుక్క మందు పోయకుండా ఓట్లు అడిగామన్నారు రేవంత్ రెడ్డి. రాజీ తన రక్తంలోనే లేదన్నారు. తాను హిందువుని ... దేవుడిని నమ్ముతాని రేవంత్ తెలిపారు. అందుకే భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేశానని రేవంత్ తెలిపారు. కేటీఆర్ ఫామ్ హౌజ్‌పై ప్రశ్నించినందుకే తపై కేసుల పెట్టారని కేసీఆర్‌తో కోట్లాడే మాపైనే ఆరోపణలా..? అంటూ ఈటలను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ వద్ద డబ్బులు తీసుకుంటే.. ఆయన కళ్లలోకి చూసే ధైర్యం నాకుండేదా? అంటూ కంటతడి పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి.
ధగ్ధస్వరంతో రేవంత్ రెడ్డి భావోద్వేగానికి గురైయ్యారు. అప్పటి వరకు ఆవేశంతో ప్రసంగించిన రేవంత్ ఒక్కసారిగా కంటతడి పెట్టుకున్నారు. ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేశారని రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తోమ్మిదేళ్లుగా కేసీఆర్‌తొ తాను పోరాటం చేస్తున్నానని.. అలాంటి కేసీఆర్ వద్ద తాను ఎలా డబ్బులు తీసుకుంటానని రేవంత్ రెడ్డి ఈటలను ప్రశ్నించారు. ఈటల రాజకీయ స్వార్థంతోనే ఆరోపణలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌పై పోరాటంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తే బాగోదంటూ రేవంత్ రెడ్డి హెచ్చరించారు.