Red Alert Telangana: తెలంగాణ ప్రజలకు రెడ్ అలర్ట్
Red Alert Telangana: మరో రెండు రోజులు వర్షాలు, భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం
Red Alert Telangana: వానలే వానలు మామూలుగా పడట్లేదు. క్షణం కూడా గ్యాప్ ఇవ్వడం లేదు. ఆకాశానికి చిల్లుపడినట్లే కురుస్తున్నాయి. మూడు రోజులు నుంచి ఇదే పరిస్థితి. ఇవేం వానలురా బాబు అని జనాలు విసిగెత్తిపోతున్నారు. బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. ఎక్కడ చిక్కుకుంటామో ఎక్కడ పడిపోతామో అని జనం కదపడం లేదు. అఖరికి ఉతికిన బట్టలు కూడా ఆరే పరిస్థితి లేదని ఇంట్లో మహిళలు చిరాకు పడుతున్నారు.
హైదరాబాద్‌లో చిన్న చినుకుపడినా పెద్ద వరదలు వచ్చేస్తాయి. ఓ గంట వర్షం పడితే నగరం తంటాలు పడుతుంది. అదే కంటిన్యూగా పడితే ఈ కంక్రీట్ నగరం పరిస్థితి ఊహించడం కష‌్టమే మూడు రోజుల పాటు కురుస్తున్న వర్షాలకు వీధులు చెరువులయ్యాయి. రోడ్లు వాగులయ్యాయి. మరోవైపు పల్లెలల్లోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ఏ నదిని చూసినా ఉగ్రరూపం దాల్చి ఉరకలెత్తుంది. ప్రాజెక్ట్‌లు నిండుకుండలా మారాయి. గేట్లను ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు.
వాన ఇంకా రెస్ట్ తీసుకోవడం లేదు. ఒడిశా, ఉత్తరాంధ్ర మీదుగా రాష్ట్రంపై దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. ఇవాళ, రేపు కూడా అత్యంత భారీ వర్షాలు అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వాన బీభత్సానికి అధికారులు అప్రమత్తమయ్యారు. రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం స్కూళ్లకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. అత్యవసరమైతేనే బయటకు రావాలని హెచ్చరిస్తున్నారు అధికారులు.
నిర్మల్ జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వానలకు అన్ని ప్రాజెక్ట్‌ల్లోకి వరదనీరు పోటెత్తింది. కడెం ప్రాజెక్ట్‌కు భారీ వరద నీరు వచ్చి చేరుతుంది. 4గేట్ల ఎత్తి నీటిని కిందకు రిలీజ్ చేశారు. ఇదిలా ఉండగా నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాల పరిసర ప్రాంతాల్లో ఇవాళ, రేపు ఏకంగా 61 సెంటీ మీటర్ల మేర వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.