సమ్మర్ ఎఫెక్ట్: బీర్ల అమ్మకాలకు 'ఫుల్' డిమాండ్
Beer Sales: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి.. ఏ మూల చూసినా కనీసం 40 డిగ్రీలు తగ్గడం లేదు.
Beer Sales: భానుడి ప్రతాపానికి బీర్లకు డిమాండ్ పెరిగిపోయింది. వేసవి తాపాన్ని తట్టుకోలేకపోతున్న మద్యం ప్రియులు బీర్లను తాగుతూ ఉపశమనం పొందుతున్నారు. బీర్ల విక్రయాలు రోజురోజుకు పెరిగిపోతుండడంతో తెలుగు రాష్ట్రాల్లో బీర్ల కొరత ఏర్పడే అవకాశం ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి.. ఏ మూల చూసినా కనీసం 40 డిగ్రీలు తగ్గడం లేదు. ఎండ తీవ్రతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేసవి తాపాన్ని తట్టుకోలేక మద్యం బాబులు చల్లచల్లని బీర్ తాగుతూ రిలీఫ్ పొందుతున్నారు
వేసవి తీవ్రత అధికం కావడంతో మద్యం ప్రియులు చల్లదనం కోసం బీర్ తాగేందుకు ఇష్టపడుతున్నారు. బీర్ల మీద బీర్లు తాగేస్తున్నారు. రోజురోజుకు బీర్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బీర్ల కొరత ఏర్పడే అవకాశం ఉంది.
కరోనా ప్రభావం మద్యం విక్రయాలపై పడడంలేదు. ఈ జనవరిలో 2,727,15 లక్షలు, ఫిబ్రవరిలో 2,331, 85 లక్షలు, మార్చి లో 2,473, 89 లక్షలు కలిపి మొత్తంగా 7,532 కోట్ల 69 లక్షల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ఏపీలో కూడా బీర్ల అమ్మకాలు పెరుగుతున్నాయి.
గత మూడు నెలల్లో లిక్కర్ తో పోటీగా బీర్ల అమ్మకాలు జరిగాయి. జనవరిలో 33 లక్షల ఐఎంఎల్ కేసులు అమ్ముడుపోగా, 28 లక్షలకు పైగా బీర్ కేసులు అమ్ముడయ్యాయి. ఫిబ్రవరిలో 29 లక్షల కేసుల ఐఎంఎల్, 22 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరిగాయి. మార్చిలో 30 లక్షల కేసుల లిక్కర్ సేల్ కాగా, 29 లక్షల 59 వేల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. రాను రాను బీర్లకు డిమాండ్ పెరుగుతుందని వైన్ షాపుల యాజమానులు చెబుతున్నారు. వేసవి తాపం నుంచి బయటపడేందుకు చల్లటి బీర్లు తాగుతున్నామని మద్యం ప్రియులు చెబుతున్నారు. కొరత రాకుండా తెలుగు రాష్ట్రాల అబ్కారీ శాఖలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.