New Ration Cards: రేషన్ కార్డులకోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త..ఆ రోజు నుంచే కొత్త కార్డులు జారీ

New Ration Cards in Telangana: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క హామీని అమలు చేస్తూ వస్తోంది. అయితే ఏ పథకం అమలు కావాలన్నా రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆరు గ్యారెంటీల అమలు కోసం అధికారులు ప్రజాపాలన ద్వారా దరఖాస్తులను స్వీకరించిన విషయం కూడా తెలిసిందే.

Update: 2024-07-12 01:58 GMT

 New Ration Cards: నేడు రేషన్ కార్డుల విధివిధానాలు విడుదల..పూర్తి వివరాలివే

New Ration Cards: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క హామీని అమలు చేస్తూ వస్తోంది. అయితే ఏ పథకం అమలు కావాలన్నా రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆరు గ్యారెంటీల అమలు కోసం అధికారులు ప్రజాపాలన ద్వారా దరఖాస్తులను స్వీకరించిన విషయం కూడా తెలిసిందే.

దీనిలో ఒక్క గ్యారెంటీ అమలు మినహా ఐదు గ్యారెంటీలకు దరఖాస్తులను ఆహ్వానించింది ప్రభుత్వం. వీరు చేసుకున్న దరఖాస్తుల్లో  ఎక్కువగా రేషన్ కార్డుల కోసం వచ్చినవి అధికంగా ఉన్నాయి.  ప్రజాపాలనలోనే కాదు ప్రజావాణిలోనూ రేషన్ కార్డులు, పింఛన్ కోసం దరఖాస్తులు చేసుకున్న వారి జాబితాను రెడీ చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు సమాచారం. కొత్త రేషన్ కార్డు దరఖాస్తు కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మంత్రి సీతక్కకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, మహిళా శిశు సంక్షేమ శాఖ తనఖీలు చేసినట్లు తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ సర్కార్ మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకపోవడంతో కేంద్ర స్కీంలను వినియోగించుకోలేకపోతున్నామని అధికారులు మంత్రి సీతక్కకు చెప్పినట్లు తెలుస్తోంది.

ఈనేపథ్యంలో త్వరలోనే రేషన్ కార్డులు మంజూరు అవుతాయని సమాచారం. ఇప్పటికే అధికారులు పెండింగ్ దరఖాస్తులను స్క్రుటినీ చేయడం ప్రారంభించారు. అందులో అర్హులకు మాత్రమే రేషన్ కార్డులను మంజూరు చేయనున్నారు. ఈ నెలాఖరు నుంచి ఈ ప్రక్రియ షురూ కానుంది.

Tags:    

Similar News