టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య ముదురుతున్న వరి వార్
Telangana: హైదరాబాద్-బెంగళూరు హైవేపై టీఆర్‌ఎస్ నేతల బైఠాయింపు
Telangana: టీఆర్‌ఎస్ సర్కార్-కేంద్రం మధ్య వరి వార్ రోజు రోజుకు ముదురుతోంది. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా జాతీయ రహదారులపై రాస్తారోకోలకు పిలుపునిచ్చింది గులాబీ సైన్యం. దీంతో హైదరాబాద్-బెంగళూరు నేషనల్ హైవేపై టీఆర్‌ఎస్ శ్రేణులు, రైతులు బైఠాయించారు. ఈ ఆందోళనల్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, అంజయ్య యాదవ్, జైపాల్ యాదవ్ పాల్గొన్నారు. యాసంగి వరి ధాన్యం మొత్తాన్ని కేంద్రమే కొని తీరాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు జాతీయ రహదారిపై టీఆర్‌ఎస్ నేతల బైఠాయింపుతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.