Telangana: శరవేగంగా తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణ పనులు

Telangana: సచివాలయం ప్రాంగణంలో మసీదు నిర్మాణం ప్రారంభం

Update: 2021-11-26 05:32 GMT

శరవేగంగా కొనసాగుతున్న కొత్త సెక్రటేరియట్ పనులు (ఫైల్ ఇమేజ్)

Telangana: తెలంగాణ నూతన సచివాలయం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఆరు అంతస్థుల భవనానికి స్లాబ్‌లు పూర్తయ్యాయి. అయితే ప్రభుత్వం అనుకున్న సమయానికి పూర్తి చేయాలని భావించిన కరోనా కారణంగా పనులు ఆలస్యం అయ్యాయి. తెలంగాణ నూతన సచివాలయానికి 2019 జూన్ 26న శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. నవంబర్ 7, 2020లో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అప్పటినుంచి 2వేల మంది కార్మికులతో పనులు కొనసాగుతున్నాయి. కరోనా సమయంలో పనులు కాస్త ఆలస్యమయ్యాయి.

నూతన సెక్రటేరియట్ నిర్మాణం పాలనారీతులకు అద్దం పట్టేవిధంగా, గౌరవం ఉట్టిపడేలా నిర్మిస్తున్నారు. తెలంగాణ సచివాలయ నిర్మాణ పనులకు సంబంధించిన ప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తగా సూక్ష్మస్థాయిలో పరిశీలిస్తూ వేగవంతంగా పూర్తి చేస్తున్నారు. సెక్రటేరియట్ ముందు, చుట్టు పక్కల నుంచి వర్షపు నీరు వెళ్లడానికి అనువైన విధంగా వరద నీటి డ్రైనేజీ వ్యవస్థను నిర్మిస్తున్నారు. దర్వాజలు, కిటికీలు, తదితర ఫర్నిచర్, విద్యుత్, ప్లంబింగ్, టైల్స్ వంటి సచివాలయ నిర్మాణంలో వినియోగించే అన్ని రకాల విభాగాలకు చెందిన ఇంటీరియర్ మెటీరియల్‌ను సిద్ధం చేశారు..

టర్కీలోని మసీదు తరహాలో కొత్త సచివాలయ ప్రాంగణంలో మసీదులను నిర్మిస్తున్నారు. రెండు మసీదుల నిర్మాణాలకు గురువారం పనులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని జామియా నిజామియా ఉర్దూ విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్స్‌లర్‌ ముఫ్తీ ఖలీల్‌ అహ్మద్‌ పనులను ప్రారంభించారు. సచివాలయ ప్రాంగణంలో గతంలో ఉన్న మసీదులు, ఆలయం, చర్చిలను పాత భవనాల కూల్చివేత సందర్భంగా తొలగించారు. వాటి స్థానంలో కొత్త నిర్మాణాలు చేపడతామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. ఇందులో భాగంగానే గురువారం మసీదుల నిర్మాణ పనులను ప్రారంభించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. 

Tags:    

Similar News