Coronavirus: మొదటి దశ కంటే వేగంగా విస్తరిస్తోన్న సెకండ్ వేవ్
Coronavirus: మొదటి దశ కంటే వేగంగా విస్తరిస్తోన్న సెకండ్ వేవ్ * రెండు రోజుల్లో తెలంగాణలో పెరుగుతోన్న మరణాలు
Coronavirus: తెలంగాణలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. మొదటి దశ కంటే సెకండ్ వేవ్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. కరోనా బారిన పడేవారి సంఖ్య రోజు రోజుకు భారీగా పెరుగుతోంది. అస్వతస్థతకు గురయ్యే వారి సంఖ్య తక్కువగానే ఉంటున్నా తొలిదశకు, రెండోదశకు ప్రధాన వ్యత్యాసాన్ని మాత్రం వైద్యులు గుర్తించారు. ఆస్పత్రుల్లో చేరికలు మొత్తంగా తక్కువే ఉన్నారు. అయితే.. ఆస్పత్రిలో చేరుతున్న వారిలో మాత్రం ఎక్కువ శాతం ఐసీయలో చికిత్స పొందుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది.
ఒక్క గాంధీ ఆసుపత్రిలోనే 108 మంది వెంటిలేటర్స్ పై చికిత్స పొందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రిలో 245 మంది, ప్రైవేట్ ఆస్పత్రిలో 734 మంది ఐసీయూ వెంటిలేటర్ చికిత్స తీసుకుంటున్నట్టు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. మరోవైపు.. ప్రభుత్వ ఆస్పత్రులతో పోల్చితే ప్రైవేట్ ఆస్పత్రుల్లోని ఐసీయూలో బెడ్స్ నిండిపోతున్నాయి. కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్‌లో 90శాతానికి పైగా నిండిపోయాయా. వీరిలో 20-45 ఏళ్ల లోపు వారు కూడా దాదాపు 40 శాతానికి పైగానే ఉన్నట్టుగా వైద్య నిపుణులు చెబుతున్నారు.
మరోవైపు గాంధీ ఆస్పత్రిలో రోజు రోజుకూ కరోనా మృతులు పెరిగిపోతున్నారు. గురువారం 178 మంది చనిపోగా శుక్రవారం 22 మంది కన్నుమూశారు. మృతుల్లో అయిదేళ్ల బాలుడి నుంచి 29 ఏళ్ల యువకుడు, 90ఏళ్ల వృద్ధుడి వరకు ఉన్నారు. గతేడాది కొవిడ్ ఉధృతంగా ఉన్నప్పూడూ ఒక్క రోజులో ఇంతమంది చనిపోలేదని వైద్యులు అంటున్నారు.