Asifabad: ఆదివాసీ గ్రామాల అభివృద్ధికి పోలీసుశాఖ అండగా ఉంటుంది- పోలీసులు

Asifabad: పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా ఆదివాసీ గిరిజనుల కష్టాలను తీర్చారు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పోలీసులు.

Update: 2021-06-22 07:43 GMT

Asifabad: ఆదివాసీ గ్రామాల అభివృద్ధికి పోలీసుశాఖ అండగా ఉంటుంది- పోలీసులు

Asifabad: పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా ఆదివాసీ గిరిజనుల కష్టాలను తీర్చారు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పోలీసులు. వాంకిడి మండలంలోని సర్కెపల్లి ఆదివాసిల కష్టాన్ని చూసి ఒక గిరిజన గ్రామం నుండి మరో గ్రామానికి వెళ్ళెందుకు వీలుగా పోలీసులు నిర్మించిన మట్టి రోడ్డుతో పాటు బొర్వెల్, కరెంటును రామగుండం సీపీ సత్యనారాయణ ప్రారంభించారు. ఆదివాసుల సంప్రదాయం ప్రకారం డప్పు వాయిద్యాలతో సీపీ కి స్వాగతం పలికారు.

ఆదివాసీ గ్రామాల అభివృద్ధికి పోలీసుశాఖ ఎప్పుడూ అండగా ఉంటామన్నారు సీపీ. వాంకిడి మండలంలోని కొలాంగూడ నుంచి సర్కెపల్లి వరకు 1 కిలోమీటర్ మేర పోలీసుశాఖ తరపున నిర్మించిన మట్టిరోడ్డును విద్యుత్ సదుపాయం, బోర్ వెల్ ను ఏర్పాటు చేశామని అన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడంతో ఎటువంటి సౌకర్యాలు లేవన్నారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలు తీర్చేందుకు పోలీసు తరపున కృషి చేస్తాం అన్నారు. పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా ఆదివాసీ ప్రజలను అన్ని విధాల ఆదుకుంటామని భరోసానిచ్చారు.

ఇక నుండి పిల్లలు అందరు స్కూల్‌కు వెళ్లి బాగా చదువుకోవాలన్నారు. ఇక్కడి వారిలో భయం పోగొట్టేందుకు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. గ్రామంలో కొన్ని కుటుంబాలకు బియ్యం పంపిణితో పాటు యువతకి వాలీబాల్ కిట్స్‌ను సీపీ పంపిణీ చేశారు. సర్కెపల్లికి రోడ్, విద్యుత్, బోర్ వెల్ సౌకర్యం కోసం కృషి చేసిన వాంకిడి సీఐ సుధాకర్, ఎస్ఐ రమేష్ లను సీపీ సత్యనారాయణ ప్రత్యేకంగా అభినందించారు.

Full View
Tags:    

Similar News